బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “పరాక్రమం”. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ నుంచి యు/ఎ సర్టిఫికేషన్ పొందింది. ఈ నెల 22న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు “పరాక్రమం” సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్, నిర్మాత ఎస్ కేఎన్ అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ – ‘పరాక్రమం’ ట్రైలర్ లాంఛ్ కు వచ్చిన నా మిత్రుడు ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్, హీరో సందీప్ కిషన్ కు థ్యాంక్స్ చెబుతున్నా. ప్రతి కామన్ మ్యాన్ కు కనెక్ట్ అయ్యే సినిమా. కామన్ మ్యాన్ లా బతకడం కష్టం. మీ లైఫ్ లో హీరోలు ఉంటారు విలన్స్ ఉంటారు. ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. అవన్నీ మిమ్మల్ని మీరు తెరపై చూసుకున్నట్లు పరాక్రమం సినిమా ఉంటుంది. నేను అభిమానించే చిరంజీవి పుట్టినరోజున ‘పరాక్రమం’ రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. చిరంజీవిని చిరంజీవి అనే పిలుస్తా. ఆయనకు భారతరత్న కూడా చిన్నదే అనేది నా అభిప్రాయం. చిరంజీవి అంటే శిఖరం. ఆయన హీరోగా నాలాంటి ఎంతోమందిని ఇన్స్ పైర్ చేశారు. అన్నారు.
Also Read: Mahesh Babu: అరాచకం.. ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసిన మహేశ్ బాబు..
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ – బండి సరోజ్ కుమార్ చాలా జెన్యూన్ ఫిలింమేకర్. ఆయన వ్యక్తిత్వం కూడా అలాగే ఉంటుంది. ఆయన సినిమా ఈవెంట్స్ కూడా రొటీన్ గా ఉండవు. నేను చెన్నైలో పోర్కాలం అనే సినిమా చూసి ఎవరీ దర్శకుడు అనుకుని ఆశ్చర్యపోయా. ఆయనే బండి సరోజ్ కుమార్. ఆ తర్వాత ఆయనను ఫేస్ బుక్ లో వెతికి మరీ టచ్ లోకి వెళ్లా. పరాక్రమం ఒక జెన్యూన్ ఫిల్మ్. ఈ సినిమా మీ ఆదరణ పొందాలి. ఆయనకు ఆయన సినిమాలకు సపోర్ట్ చేసేందుకు నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. అన్నారు.