హారర్ థ్రిల్లర్ “డోంట్ బ్రీత్”కు ఫ్రాంచైజీతో కొనసాగుతున్న”డోంట్ బ్రీత్-2” ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. హారర్ థ్రిల్లర్ సీక్వెల్ చాలా సంవత్సరాల తరువాత ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2016లో విడుదలైన “డోంట్ బ్రీత్”లో స్టీఫెన్ లాంగ్ అంధుడిగా నటించారు. ఆయన అంధుడని తెలుసుకున్న కొంతమంది అపరిచితులు రాత్రిపూట తన ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత వారు స్టీఫెన్ ను చంపడానికి ప్రయత్నిస్తారు. వారిని అంధుడైన ఆయన ఎలా ఎదుర్కున్నాడు అనేదే సినిమా కథ. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.
Read Also : వివాహం, విడాకులు ఖతమ్… వివాదం మాత్రం కంటిన్యూ!
సోనీ పిక్చర్స్ ఇండియా “డోంట్ బ్రీత్-2” చిత్రాన్ని ఆగస్టు 13న థియేటర్లలో విడుదల చేయనుంది. ఈ సీక్వెల్ ను స్క్రీన్ జెమ్స్, స్టేజ్ 6 ఫిల్మ్స్, గోస్ట్ హౌస్ పిక్చర్స్, గుడ్ యూనివర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రోడో సయాగుస్ దర్శకత్వం వహించారు. తాజాగా విడుదలైన “డోంట్ బ్రీత్-2” ట్రైలర్ కూడా ఉత్కంఠభరితంగా ఉంది. ఒక అనాథ అమ్మాయిని పెంచుకుంటాడు స్టీఫెన్ లాంగ్. కొంతమంది నేరస్థులు ఆ ఇంట్లోకి చొరబడి ఆమెను కిడ్నాప్ చేస్తారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఆ అమ్మాయిని అంధుడైన స్టీఫెన్ ఎలా కాపాడాడు ? అనే ఆసక్తిని కలిగిస్తోంది.