Balakrishna : నందమూరి బాలయ్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఆయన కొడుకు మోక్షజ్ఞను కూడా పరిచయం చేసే పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు. మోక్షజ్ఞ ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాతో పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పుడు మోక్షజ్ఞ గురించి మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే తండ్రి బాలయ్య సినిమాలో మోక్షు కనిపించబోతున్నాడంట. క్రిష్ జాగర్ల మూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు బాలయ్య ఒప్పుకున్నాడు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మోక్షజ్ఞ కనిపించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఎంతైనా తండ్రి సినిమాలో కనిపిస్తే.. ఆ క్రేజ్ వేరే ఉంటుంది. గతంలో చాలా మంది హీరోలు తమ కొడుకులను తమ సినిమాలో చూపించిన తర్వాతే ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
Read Also : Barrelakka: “నాకు పెళ్లైన సంతోషం కూడా లేదు” బర్రెలక్క వీడియో వైరల్..
ఇప్పుడు బాలయ్య కూడా అదే దారిలో వెళ్లాలని చూస్తున్నాడంట. చూస్తుంటే ప్రశాంత్ వర్మ సినిమా కంటే ముందే క్రిష్ తో చేసే సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడంట బాలయ్య. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాను రిలీజ్ చేస్తే హైప్ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నాడంట. గతంలో తన వందో సినిమాను బాలయ్య క్రిష్ తో చేశాడు. ఇన్ని రోజుల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతోంది. మోక్షజ్ఞ తన లుక్ ను పూర్తిగా మార్చేసుకున్నాడు. రీసెంట్ గా పద్మభూషణ్ అవార్డును బాలయ్య అందుకున్న సందర్భంగా మోక్షజ్ఞ ఫ్యామిలీతో కనిపించిన లుక్ వైరల్ అయింది. మరి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడా లేదా అన్నది చూడాలి.
Read Also : Jr NTR : కొత్త లుక్ లో ఎన్టీఆర్.. పిక్స్ చూశారా..