యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆయనకు సినీ సెలబ్రిటీలు, అలాగే ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే, అందరికన్నా మోహన్ బాబు చేసిన బర్త్‌డే విషెస్ మాత్రం ఆసక్తికరంగా మారాయి.
Also Read :MEGA 157 : మన శంకరవరప్రసాద్ సెట్స్ లో అడుగు పెట్టిన పెళ్లికాని ప్రసాద్
“మై డియర్ డార్లింగ్ బావా ప్రభాస్, నువ్వు ఈ జాతి మొత్తానికి ఒక సినీ గర్వకారణం. నీకు అపరిమిత ఆనందం లభించాలని కోరుకుంటున్నాము. ఇలాగే మరిన్ని పుట్టినరోజులు చాలా గ్రాండ్‌గా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నీకు మంచి ఆరోగ్యం కలగాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే, నీకు త్వరగా పెళ్లి అయ్యి, మంచి హ్యాపీ లైఫ్ గడపాలని, ఒక డజన్ మంది పిల్లలు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు, నిన్ను ఎల్లప్పుడూ ప్రేమించే మీ బావ,” అంటూ రాసుకొచ్చారు.
Also Read :Chiranjeevi : అయ్యప్ప మాల ధారణ చేసిన మెగాస్టార్
అంతేకాక, ‘కన్నప్ప’ సినిమాలో ఒక వర్కింగ్ స్టిల్‌ను కూడా ఆయన షేర్ చేశారు. నిజానికి వీరిద్దరూ కలిసి ‘బుజ్జిగాడు’ అనే సినిమాలో నటించారు. అందులో ప్రభాస్, మోహన్ బాబు సోదరి త్రిషను ప్రేమిస్తాడు. ఆ సినిమాలో వీళ్ళిద్దరూ బావ, బావమరిది అని పిలుచుకున్నారు. అప్పటినుంచి బయట కూడా అలాగే పిలుచుకుంటూ మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ రిలేషన్ కారణంగానే ‘కన్నప్ప’ సినిమాలో ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా నటించాడు ప్రభాస్.