Mohanbabu : మంచు ఫ్యామిలీ మీద వచ్చిన, వస్తున్న ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా విష్ణు, మోహన్ బాబు మీద తీవ్రమైన ట్రోలింగ్ ఎప్పటి నుంచో జరుగుతోంది. దానిపై ఎప్పటికప్పుడు విష్ణు స్పందించారు. ట్రోల్ చేస్తున్న వారిపై కేసులు కూడా పెట్టారు. అయినా ట్రోల్స్, నెగెటివ్ కామెంట్లు ఆగట్లేదు. కన్నప్ప మూవీపై మొదటి నుంచి భారీ ట్రోలింగ్ జరిగింది. కానీ సినిమా రిలీజ్ టైమ్ దగ్గర పడే కొద్దీ పాటలకు అంతా ఫిదా అయ్యారు. మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. విష్ణు నటనకు ప్రశంసలు దక్కాయి. అయినా సరే కొందరు పనిగట్టుకుని ట్రోల్స్ చేస్తున్నారు. మూవీ అట్లర్ ప్లాప్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వీటిపై తాజాగా మోహన్ బాబు స్పందించారు.
Read Also : Nagavamsi : విజయ్ కోసం ఎన్టీఆర్ సినిమాపై సైలెంట్..?
సమాజంలో విమర్శ-సద్విమర్శ, ప్రకృతి-వికృతి అని రెండూ ఉంటాయి. ఒకరు మనల్ని విమర్శిస్తున్నారు అంటే వారిపై కోప్పడాల్సిన పనిలేదు. వారిని ఆశీర్వదించాలి. ఎందుకంటే మనం గత జన్మలో లేదా ఈ జన్మలో ఏమైనా తప్పులు చేసి ఉంటే అవి వారి విమర్శల ద్వారా తొలగిపోతున్నాయని గ్రహించాలి. నాకు ఈ విషయం గతంలో ఓ పండితుడు చెప్పాడు. అందుకే నేను వారిని ఏమీ అనను. వాళ్లు, వాళ్ల కుటుంబాలు క్షేమంగా ఉండాలి అని కోరుకుంటా అని చెప్పుకొచ్చారు మోహన్ బాబు. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కన్నప్ప మూవీకి హిట్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం పెద్దగా రాలేదనే చెప్పుకోవాలి. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్లు ఉన్నా ఆ స్థాయి కలెక్షన్లు ఎక్కడా కనిపించలేదు. బహుషా వాళ్లు ప్రమోషన్లు పెద్దగా చేయకపోవడం కూడా కారణమే కావచ్చు.
Read Also : Pawan Kalyan : ఛీ..ఛీ.. అంటూ పవన్ పై ప్రకాశ్ రాజ్ ట్వీట్.. జనసేన కౌంటర్..