Pawan Kalyan : ఛీ..ఛీ.. అంటూ పవన్ పై ప్రకాశ్ రాజ్ ట్వీట్.. జనసేన కౌంటర్..
- హిందీ భాషపై పవన్ కామెంట్స్
- ప్రకాశ్ రాజ్ ట్వీట్
- లక్షల్లో ట్వీట్లు చేస్తున్న జనసైనికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan : పవన్ కల్యాణ్ వర్సెస్ ప్రకాశ్ రాజ్ వార్ మరోసారి తెరమీదకు వచ్చింది. అది కూడా హిందీ భాష మీదనే. గతంలోనూ హిందీ భాష విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరిగాయి. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన రాజ్యభాష విభాగం స్వర్ణోత్సవంలో పవన్ కల్యాణ్ పాల్గొని హిందీ భాషపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మాతృభాష అమ్మలాంటిది అయితే హిందీ భాష పెద్దమ్మ లాంటిది అన్నారు. హిందీ నేర్చుకుంటే మనల్ని తక్కువ చేసుకున్నట్టు కాదని.. మరింత బలపడ్డట్టు అవుతుందన్నారు. పవన్ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. ‘ఈ రేంజ్ కు అమ్ముకోవడమా.. ఛీ..ఛీ’ అంటూ రాసుకొచ్చారు. ఇంకేముంది ఆ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయిపోయింది.
Read Also : Ronith Roy : తిండిలేక ఇబ్బందులు పడ్డా.. ప్రముఖ నటుడు కామెంట్స్
Also Read
జనసేన పార్టీ ప్రకాష్ రాజ్ కు కౌంటర్ ఇచ్చింది. అసలు అమ్ముకోవడం అంటే ఇదే అంటూ ప్రకాశ్ రాజ్ కు సంబంధించిన ఓ పాత వీడియోతో కౌంటర్ ఇచ్చింది. మాతృభాషను కాపాడుకుంటూ, ఇతర భాషలను నేర్చుకోవడం, గౌరవించడం అమ్ముకున్నట్టు కాదని.. అసలు ఇతర భాషలు నేర్చుకోవడమే తప్పు అంటే నువ్వు తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో సినిమాలు చెయ్యగలవా? ఈరోజు ఇలా అమ్ముడుపోయి మాట్లాడగలవా అంటూ ట్వీట్ చేసింది. అటు జనసైనికులు లక్షల్లో ట్వీట్లు చేస్తూ ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ ఇస్తున్నారు. పవన్ కల్యాణ్ హిందీ నేర్చుకోమన్నారు అంటే అది మనకు ఉపయోగపడుతుందనే తప్ప.. అమ్ముడు పోయినట్టు కాదని కామెంట్లు పెడుతున్నారు.
Read Also : Nimisha priya Case: కేరళ నర్సు నిమిష ప్రియ కేసేంటి.? ఏం జరిగింది..?
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!