చెప్పకూడదు కానీ చెప్తున్నా…. చిరు, చరణ్ సపోర్ట్ పై మంచు విష్ణు

‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచిన తరువాత మంచు విష్ణు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చెప్పకూడదు కానీ చెప్పేస్తున్నా అంటూ చిరంజీవి, చరణ్ సపోర్ట్ ప్రకాష్ రాజ్ కే అని కామెంట్స్ చేశారు.ఆయన మాట్లాడుతూ “చెప్పకూడదేమో కానీ ఇప్పుడు అంతా అయిపొయింది కాబట్టి చెప్తున్నా. మా నాన్నగారిని రిక్వెస్ట్ చేసింది, నన్ను సైడ్ అవ్వమని చెప్పింది చిరంజీవి అంకుల్. కుదరని నేపథ్యంలో ఎలక్షన్స్ వచ్చాయి. నాన్న గారు లేదు ఎందుకులే ఎలేచ్షన్స్ కు వెళ్దాం అన్నారు. అయితే చిరంజీవి గారు ఎందుకులే ప్రకాష్ రాజ్ పోటీ చేస్తున్నారుగా యునానిమస్ గా వెళ్దాం. విష్ణు ఎందుకు పోటీలో విత్ డ్రా చేసుకోమని చెబుదాం అంటూ చిరంజీవి అన్నారు. కానీ ఎలక్షన్స్ వెల్దామన్న ఉద్దేశంతోనే మేము ఎలక్షన్స్ కు వచ్చాము.

Read Also : ప్రెసిడెంట్ గా యాక్సెప్ట్ చేయను… నాగబాబుపై మంచు విష్ణు కామెంట్స్

రామ్ చరణ్ నాకు మంచి మిత్రుడు. కానీ ఆయన 99% తన ఓటు ప్రకాష్ రాజ్ కే వెళ్ళింది. ఎందుకో చెప్తా… చరణ్ తన తండ్రి మాటను జవదాటరు. నేను చరణ్ పొజిషన్ లో ఉంటే అలాగే చేస్తాను. ఎందుకంటే చరణ్ కు వాళ్ళ డాడీ అంటే అంత ఇష్టం. దాన్ని నేను ఒప్పుకుంటా. నేను వెళ్లి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటా” అని చెప్పుకొచ్చారు.

-Advertisement-చెప్పకూడదు కానీ చెప్తున్నా…. చిరు, చరణ్ సపోర్ట్ పై మంచు విష్ణు

Related Articles

Latest Articles