Hayley Atwell: సినిమా రంగంలో హీరో హీరోయిన్ల మధ్య కొద్దిగా రొమాన్స్ హద్దు దాటితే బయట కూడా వారి మధ్య ఏదో ఉందని చెప్పుకొస్తారు. ఇలాంటి రూమర్లు ప్రతి హీరోయిన్ ఎదుర్కొనేదే. దానికి భాషతో సంబంధం లేదు. హాలీవుడ్ లో కూడా ఇలాంటి రూమర్స్ కు కొదువే లేదు. ఒక హీరోయిన్.. తనకన్నా ఏజ్ లో పెద్ద అయినా హీరోతో రొమాన్స్ చేస్తే .. బయట కూడా శృంగారంలో పాల్గొంటుంది అని పుకార్లు పుట్టించేస్తున్నారు. ఇది అన్యాయం అని అమెరికన్ నటి హేలీ అట్వెల్ వాపోయింది. మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకానింగ్ పార్ట్ 1 లో యాక్షన్ హీరో టామ్ క్రూజ్ సరసన ఈ చిన్నది కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ట్రైలర్ లో హేలీ, టామ్ క్రూజ్ మధ్య రొమాన్స్ చాలా ఘాటుగా నడిచింది. దీంతో వీరి మధ్య ఎఫైర్ ఉందని పుకార్లు పుట్టుకొచ్చాయి. వీరు రిలేషన్ లో ఉన్నారని గత కొన్నిరోజులుగా హాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఈ పుకార్లపై తాజాగా హేలీ స్పందించింది. ఇలాంటి పుకార్లు పుట్టించినవాళ్లకు సిగ్గులేదు అంటూ ఫైర్ అయ్యింది.
Mahesh Babu: ‘గేమ్ ఛేంజర్’ లో మహేష్ బాబు.. ఆ లుక్ ఏదైతే ఉందో ..
” నా వయస్సు 41 .. టామ్ క్రూజ్ వయస్సు 61. మేము ఇద్దరం శృంగారంలో పాల్గొనడం ఏంటీ..? అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు. ఈ వార్తనే చాలా చెత్తగా ఉంది. అంత డర్టీగా ఎలా ఆలోచించగలుగుతున్నారు. ఆయన నాకు అంకుల్ లాంటి వారు. ఆయనకూడా నన్నెప్పుడూ చేదు ఉద్దేశ్యంతో చూడలేదు. ఆయనతో ఇలా శృంగారం చేశాను అని చెప్పుకొస్తున్నారు సిగ్గుగా లేదా.. ?. నటిని కాబట్టి స్క్రీన్ మీద మాత్రమే మా మధ్య రొమాన్స్ జరిగింది. అయినా నాకు సింగర్ కెల్లీతో ఎంగేజ్మెంట్ అయ్యింది. త్వరలో పెళ్లి కూడా జరగబోతుంది. ఇంతటితో ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టండి” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.