Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఒకపక్క సినిమాలు చేస్తూనే ఇంకోపక్క వాణిజ్య ప్రకటనలు చేస్తూ బిజీగా మారాడు. ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా కూడా కుటుంబంతో కలిసి సమయాన్ని గడుపుతుంటాడు. తాజాగా మహేష్, భార్య నమ్రతతో కలిసి ఒక ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్ళాడు. హీల్-ఎ-చైల్డ్ కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ జంట తళుక్కున మెరిశారు. హీల్-ఎ-చైల్డ్ సంస్థ .. చిన్నారులకు మరో జన్మను ప్రసాదించే సంస్థ. ఈ సంస్థకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. దీంతో హీల్-ఎ-చైల్డ్ సంస్థ గేమ్ ఛేంజర్ 2023 అనే కార్యక్రమానికి ఈ జంట ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఈసందర్భంగా మహేష్- నమ్రత వేదికపై సంస్థ గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Blood & Chocolate: లెజండరీ డైరెక్టర్ శంకర్ చేతుల మీదుగా ‘బ్లడ్ అండ్ చాక్లెట్’ ఆడియో రిలీజ్
ఇక ఈ వేడుకలో మహేష్ లుక్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. రెడ్ కలర్ హూడీ వేసుకొని ఎంతో స్టైలిష్ లుక్ లో మహేష్ కనిపించాడు. అసలు మహేష్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 47 ఏళ్ళ వయసులో ఆయన ఫిట్ నెస్ చూస్తే మెంటల్ ఎక్కి పోతుందని చెప్పాలి. ఈ ఏజ్ లో కూడా కుర్ర హీరోలు సైతం కుళ్ళుకోనేలా మహేష్ అందం మెస్మరైజ్ చేస్తోంది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు.. అసలు ఎలా అన్నా.. ఇంత అందాన్ని మెయింటైన్ చేస్తున్నావ్.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు.