Mirai: తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. ఈ సినిమా తాజాగా డే 2 రికార్డ్స్ విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి డే 2 కలెక్షన్స్‌లో మిడ్ రేంజ్ సినిమాలకు సంబంధించి మిరాయ్ ఒక రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాల డేటు కలెక్షన్స్‌ను క్రాస్ చేసింది. 8.2 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టి, ఈ సినిమా టాప్ సినిమాగా నిలిచింది.
ఈ సినిమా తర్వాతి వరసలో తండేల్, టిల్లు స్క్వేర్, కుబేర, ఉప్పెన వంటి సినిమాలు నిలుస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తేజ సజ్జా గతంలో హీరోగా నటించిన హనుమాన్ సినిమా కూడా సెకండ్ డే నాలుగు కోట్ల 36 లక్షలు మాత్రమే సాధించింది. కానీ, ఈ మిరాయ్ సినిమా మాత్రం దానికి డబుల్ 8 కోట్ల 20 లక్షలు సాధించి, తేజ హనుమాన్ రికార్డును మళ్ళీ తేజ అనే బద్దలు కొట్టుకున్నట్లు అయింది. ఇక, ఆ తర్వాత నాని నటించిన హిట్, త్రీ, దసరా, విజయ్ దేవరకొండ ఖుషి, కింగ్‌డమ్, గీతగోవిందం వంటి సినిమాలు కూడా ఈ సినిమా తర్వాతే ఉండడం గమనార్హం.