Michael Jackson: పాప్ రారాజు మైకేల్ జాక్సన్ మరణం ఇప్పటికి మిస్టరీగానే ఉంది. 50 ఏళ్ళ వయస్సులో ఆయన మృతి చెందారు. ఇక ఆయన మరణాన్ని ఇప్పటికి సంగీత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్న విషయం తెల్సిందే. ఆయన మన మధ్యలేకపోయిన బ్రేక్ డాన్స్ రూపంలో నిత్యం జీవించే ఉన్నాడు. మైకేల్ చనిపోయాకా ఆయన బయోపిక్ ను తీయడానికి చాలామంది ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, అందులో ఏది నిజం కాదని తెలిసింది. మైకేల్ జీవితం అంటే వివాదాల పూతోట. సర్జరీలు, గొడవలు, ప్రేమలు, పెళ్లిళ్లు.. ఇలా అన్ని వివాదాలే. అవన్నీ కూడా సింగింగ్ రారాజు మీద అభిమానాన్ని చంపలేకపోయాయి. ఇక వాటన్నింటిని తెరమీదకు తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇక మైకేల్ బయోపిక్ కు కథను అందిస్తోంది కూడా అల్లాటప్పా రైటర్ కాదు.. మూడుసార్లు ఆస్కార్ ను అందుకున్న జాన్ లోగన్. ఇక ఈ సినిమాకు అంటోనియో ఫుకో దర్శకత్వం వహిస్తుండగా మైకేల్ జాక్సన్ కుటుంబం నిర్మిస్తోంది.
Chiranjeevi: నాకు తెల్సిన బ్రహ్మానందం అంటూ చిరు ట్వీట్.. వైరల్
ఇక ఈ బయోపిక్ లో మైకేల్ పాత్రలో ఎవరు నటిస్తారు అనేది పెద్ద ప్రశ్న. ఆయనలా సంగీతంలోను, పోలికలోనూ సరిసమానంగా ఉన్నది ఎవరు అని ఆలోచిస్తుండగా.. మైకేల్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జాఫర్ జాక్సన్ లైన్లోకి వచ్చాడు. జాఫర్.. మైకేల్ తమ్ముడు కుమారుడు.. పాప్ సింగర్ అండ్ డాన్సర్. పెద్దనాన్న బయోపిక్ లో నటించడానికి అతడికి మించి అర్హత ఇంకెవరికి ఉంటుంది. అతను కూడా ఈ పాత్ర చేయడానికి అదృష్టం చేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసిన డైరెక్టర్.. త్వరలోనే ఈ బయోపిక్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారట. మరి ఈ బయోపిక్ ను ఇండియాలో కూడా రిలీజ్ చేయమని అభిమానులు కోరుకుంటున్నారు.