Mem Famous: లహరి, చాయ్ బిస్కెట్ సంస్థలు ‘రైటర్ పద్మభూషణ్’ తర్వాత కలిసి నిర్మించిన రెండో సినిమా ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వ వహించిన తొలి చిత్రమిది. విలేజ్ ఫన్ డ్రామా గా రూపొందిన ఈ చిత్రంలో మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య , సిరి రాశి ఇతర ప్రధాన తారాగణం. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ ఈ సినిమాను నిర్మించారు. పాజిటివ్ బజ్ తో దూసుకెళుతున్న ఈ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకుంది. చిత్రానికి సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. 2:29:59 సినిమా రన్‌టైమ్ ను మేకర్స్ లాక్ చేశారు. భావోద్వేగాలు సమ్మిళతమైన ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ నూ మెప్పిస్తుందని నిర్మాతలు చెబుతున్నారు. సుమంత్ ప్రభాస్ కథను చక్కగా హ్యాండిల్ చేశాడని, అతని రైటింగ్ మేజర్ అసెట్ అని అన్నారు. ఈ నెల 26న విడుదల కాబోతున్న ‘మేమ్ ఫేమస్’కు శ్యామ్ దూపాటి సినిమాటోగ్రఫీని, కళ్యాణ్ నాయక్ సంగీతాన్ని అందించారు.