అరెస్టయిన కారణంగా అల్లు అర్జున్ ఒకరోజు రాత్రి జైలులో గడిపి ఈరోజు ఉదయమే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి అల్లు అర్జున్ నివాసానికి సినీ ప్రముఖులందరూ క్యూ కట్టారు. అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు వారందరూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఆసక్తికర సన్నివేశాలు ప్రేక్షకులకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ నివాసంలో ఎమోషనల్ సీన్స్ కనిపిస్తున్నాయి. నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి తన షూటింగ్ నిలిపివేసి తన భార్య సురేఖతో కలిసి అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళిన సంగతి తెలిసిందే.
ఇక ఈరోజు ఉదయాన్నే సురేఖ తన మేనల్లుడిని చూసేందుకు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. ఇక అక్కడ అల్లు అర్జున్ తన మేనత్తను హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతూ కనిపించారు. ఆ తర్వాత ఆమె చేతిని ముద్దాడుతున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అల్లు అర్జున్ మేనత్త మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ గురించి చర్చ జరుగుతోంది. మరోపక్క అల్లు అర్జున్ నివాసానికి సినీ ప్రముఖులందరూ వెళుతున్నారు. హీరోలు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, రానా, శ్రీకాంత్ వంటి వాళ్ళు ఇప్పటికే అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి సహా కొరటాల శివ వంటి వాళ్ళు సైతం అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి అల్లు అర్జున్ పరామర్శించారు.