అరెస్టయిన కారణంగా అల్లు అర్జున్ ఒకరోజు రాత్రి జైలులో గడిపి ఈరోజు ఉదయమే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి అల్లు అర్జున్ నివాసానికి సినీ ప్రముఖులందరూ క్యూ కట్టారు. అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు వారందరూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఆసక్తికర సన్నివేశాలు ప్రేక్షకులకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ నివాసంలో ఎమోషనల్ సీన్స్ కనిపిస్తున్నాయి. నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి తన షూటింగ్ నిలిపివేసి…