ఆగస్టు 22న చిరు బర్త్ డే కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులంతా పండగలా జరుపుకుంటూ ఉంటారు. సంక్రాంతి, దసరా, దీపావళి లాంటి పండగల కన్నా ఆగస్టు 22న బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ని చేస్తారు మెగా ఫ్యాన్స్. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇండస్ట్రీ వర్గాలు, చిరు సన్నిహిత వర్గాలు కూడా సోషల్ మీడియాలో చిరుకి బర్త్ డే విషెష్ చెప్తూ పోస్టులు పెడుతూ ఉంటారు. ఈరోజు చిరు వింటేజ్ ఫోటోలు, ఫ్యాన్ మేడ్ ఎడిట్ లు, స్టార్ హీరోల నుంచి వచ్చిన విషెస్ తో చిరు పేరు సోషల్ మీడియాలో మారుమోగుతూ ఉంటుంది. చిరుకి ఎంతోమంది స్టార్ స్టేటస్ ఉన్న వాళ్లు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి ఉంటారు కానీ రామ్ చరణ్ చేసిన పోస్ట్ మాత్రం చాలా స్పెషల్ గా నిలిచింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇంస్టాగ్రామ్ లో చిరుకి బర్త్ విషెష్ చెప్తూ ఒక స్పెషల్ ఫోటోని పోస్ట్ చేసాడు. ఈ ఫోటోలో చిరుతో పాటు చరణ్ కూతురు, మెగా మనవరాలు క్లింకారా కూడా ఉండడం విశేషం. క్లింకారా ఫేస్ రివీల్ చెయ్యకుండా చరణ్ పోస్ట్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతి మెగా అభిమానిని హ్యాపీ చేసింది. మనవరాలిని ఎత్తుకోని నవ్వుతున్న చిరుని చూసి మెగా ఫ్యాన్స్ అంతా చాలా హ్యాపీ అవుతున్నారు. “Happiest Birthday to our dearest CHIRUTHA – (Chiranjeevi Thatha) Loads of love from us & the Littlest member of the KONIDELA family.” అంటూ కోట్ చేసిన చరణ్… చిరుని చిరు తాత చేసాడు.