ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. మహిళ త్యాగాలను గుర్తించి ఆమెను అబినందనల్తో ముంచెత్తుతున్నారు. ఇక తాజాగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ తో హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ ప్రతి మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
” ఈ సమయంలో సినిమా టికెట్ జీవో గురించి మాట్లాడను.. ఈ సమయంలో నేను ఏది మాట్లాడినా అది వివాదమే అవుతుంది. కావాలంటే దాని గురించి మాట్లాడానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తాను.. ఈ సమయంలో కేవలం మహిళల ఔనత్యం గురించే మాట్లాడాలి. కుటుంబంపై బాధ్యతలు తీసుకుంటున్న మహిళలకు నమస్కరిస్తున్నాను. ఇప్పుడున్న సమాజంలో మహిళలు కుటుంబానికి మాత్రమే అంకితమవ్వడంలేదు.. ప్రతి రంగంలోనూ తమ సత్తా చాటుతున్నారు. అందుకు మనం ఎంతో గర్వించాలి. వారికి అండగా ఉంటూ ఇంకా ఎదిగేలా ప్రోత్సహించాలి. నేను మెగాస్టార్ గా కావడానికి నా భార్యనే కారణం. నేను సక్సెస్ కోసం పోరాడుతున్న సమయంలో కుటుంబ బాధ్యతలు ఆమె తీసుకున్నది కాబట్టే ఈరోజు నేను ఇలా నిలబడ్డాను” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.