Bhola Shankar censor Review: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమా రిలీజ్ కి సమయం దగ్గర పడింది. అయితే ఈ సినిమాకి తాజాగా సెన్సార్ కూడా పూర్తయింది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. పెద్దగా కట్స్ ఏమి లేకుండానే సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ ఇచ్చేసింది. మేకర్స్ కూడా మెగాస్టార్ చిరంజీవి మాస్ యుఫోరియాని ఆగష్టు 11న థియేటర్స్‌లో చూస్తారని చెబుతున్నారు. అయితే నిజానికి ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు మొత్తం మీద నాలుగు కరెక్షన్స్ చెప్పారు. అదేమంటే సినిమాలో మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం టెక్స్ట్ సైజ్ పెంచాల్సిందిగా సూచించారు. డ్రగ్స్ వాడకం మీద సూచనలు సినిమా మొదట్లో చేయాల్సిందిగా సూచించారు. ఇంటర్వెల్ ముందు హీరో విలన్ తల నరుకుతున్నప్పుడు ఆ విజిబిలిటీ తగ్గించాలని సూచించారు.
Sruthi Shanmuga Priya: పుట్టెడు దుఃఖంలో ఉన్నాం.. లైకుల కోసం మమ్మల్ని వేధించకండి!
అలాగే బద్దలు బాసింగాలు అనే పదం డబ్బింగ్ నుంచి తొలగించడమే కాదు సబ్ టైటిల్స్ నుంచి కూడా తొలగించాలని సూచించారు. ఇక ఆ సంగతి పక్కన పెడితే అసలు మెగాస్టార్ ఫ్యాన్స్‌కు కావాల్సింది ఏంటి? చిరు వింటేజ్ లుక్, మెగాస్టార్ స్టైల్ ఆఫ్ కామెడీ, అదిరిపోయే యాక్షన్, దానికి తోడు ఎమోషనల్ టచ్, గూస్ బంప్స్ వచ్చే ఎలివేషన్స్ ఇవి కనుక సినిమాలో ఇవి ఉంటే చాలు. థియేటర్ టాపు లేచి పోవాల్సిందే. చివరగా వాల్తేరు వీరయ్యలో వింటేజ్ చిరుని చూపించి మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చాడు డైరెక్టర్ బాబీ. ఇప్పుడు అంతకు మించి అనేలా వింటేజ్ వైబ్స్‌తో భోళా శంకర్‌ను నింపేశారట మెహర్ రమేష్. ఇప్పటికే రిలీజ్ అయిన భోళా శంకర్ ట్రైలర్‌తో ఈ విషయాన్ని చెప్పకనే చెప్పయగా ఇప్పుడు సెన్సార్ రివ్యూ కూడా ఓ రేంజ్‌లో ఉందని తెలియడంతో మెగా ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Bhola Censor1
సెన్సార్ టాక్ అదిరిపోయిందని, వాల్తేరు వీరయ్య తర్వాత మరోసారి ఊరమాస్‌గా చిరు రచ్చ రచ్చ చేసినట్లు చెబుతున్నారు. సినిమా కంటెంట్ సంగతి పక్కన పెడితే.. మేకింగ్ విషయంలో మెహర్ రమేష్ హీరోకి ఇచ్చే ఎలివేషన్ ఓ రేంజ్‌లో ఉంటుందనేది ఎవరూ కాదనలేని సత్యం. ఇప్పుడు మెగాస్టార్‌ను కూడా అంతకుమించి అనేలా ప్రజెంట్ చేసినట్టు తెలుస్తోంది. ఒక మెగాభిమానికి ఏం కావాలో.. అది భోళా శంకర్‌లో ఉందని సెన్సార్ రిపోర్ట్స్ అయితే చెబుతున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమాతో మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ ఉంటుందని అది కూడా వాల్తేరు వీరయ్యని మించేలా ఉంటుంది అని ఇన్ సైడ్ ఇన్ఫో. ఇక ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి భోళా శంకర్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మాస్ ట్రీట్ ఇస్తాడో చూడాలి.
Bhola Censor