Mammootty: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వివాదంలో చిక్కుకున్నాడు. స్టార్ హీరోగా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న ఈ హీరో తాజాగా తన డైరెక్టర్ ను అందరి ముందు అవమానించి నెటిజన్ల విమర్శలకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం మమ్ముట్టి 2018 అనే సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ సినిమాకు జూడ్ ఆంథనీ జోసెఫ్ అనే దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ ఈవెంట్ లో మమ్ముట్టి మాట్లాడుతూ ” జోసెఫ్ కు నెత్తిమీద జుట్టు లేకపోయినా అసాధారణమైన మెదడు కలిగిన అత్యంత ప్రతిభావంతుడైన ఫిలింమేకర్” అని చెప్పుకొచ్చాడు. దీంతో మమ్ముట్టిపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఒక స్టార్ హీరో అయ్యి ఉండి దర్శకుడుని బాడీ షేమింగ్ చేయడమేంటి..? బట్టతల అని అందరిముందు హేళన చేయడం పద్దతి కాదని చెప్పుకొస్తున్నారు. ఇక తాజాగా ఈ వివాదానికి చెక్ పెట్టాడు మమ్ముట్టి. దర్శకుడికి సారీ చెప్తూ మమ్ముట్టి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ” నిన్న జెరిగిన ఈవెంట్ లో జోజిఫ్ ను ప్రశంసించడానికి వాడిన పదాలు మిమ్మల్ని బాధపెట్టినందుకు నన్ను క్షమించండి. అలాంటి పద్ధతులు పునరావృతం కాకుండా మరింత జాగ్రత్త తీసుకుంటాను. దీనిని నా దృష్టికి తీసుకొచ్చిన వారందరికీ ధన్యవాదాలు” అని మమ్ముట్టి పోస్ట్ చేశారు. దీంతో ఈ వివాదం ముగిసింది అనే అనుకుంటున్నారు.