ఈసారి మెగాస్టార్ దెబ్బకు బాక్సాఫీస్ లెక్కలన్నీ మారిపోతాయ్ అని… సాలిడ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ఠతో మెగా 157 ప్రాజెక్ట్‌ను సోషియో ఫాంటసీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మెగా 157 ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. వీలైనంత త్వరగా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. జగదేకవీరుడు అతిలోక సుందరి తర్వాత మెగాస్టార్ చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ఇదే కాబట్టి ఈ సినిమాకు విజవల్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే… ముందుగా మెగా 156 కంటే, మెగా 157 షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు మెగాస్టార్. పంచభూతాలను కలుపుతూ… మూడు లోకాల చుట్టు తిరిగే కథగా ఈ సినిమా ఉంటుందని మెగాస్టార్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారని తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌కు ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటి వరకు టైటిల్ గురించి ఎలాంటి లీకులు లేవు కానీ లేటెస్ట్ టైటిల్ టాక్ మాత్రం వైరల్‌గా మారింది. ఈ సినిమాకు ‘ముళ్ళోకాల వీరుడు’ అనే టైటిల్ అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో నిజం ఎంతో తెలియదు గానీ… ఇప్పటి వరకు మెగా 157 నుంచి బయటికొచ్చిన అప్డేట్స్ ప్రకారం… ఇలాంటి టైటిల్ ప్రచారంలోకి రావొచ్చు. అంతే తప్పా.. మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ఇంకా టైటిల్ విషయంలో ఫైనల్ డిసిషన్ తీసుకోలేదని తెలుస్తోంది. పైగా ‘ముళ్ళోకాల వీరుడు’ అనే టైటిల్ ఏ మాత్రం ఇంప్రెసివ్‌గా లేదు కాబట్టి.. మెగా 157 టైటిల్ పై క్లారిటీ రావాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ చిత్రాన్ని లీడింగ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తుండగా… ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.