Meenakshi Chaudhary: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబుతో కలిసి గుంటూరుకారం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఏ ముహూర్తాన ఈ సినిమా మొదలైందో కానీ, ఇప్పటివరకు ఆ సినిమా ఫినిష్ అయింది లేదు. పూజా కార్యక్రమాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎన్నో కారణాల ద్వారా సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఇక మధ్యలో ఈ చిత్రం నుంచి నటీనటులు, టెక్నీషియన్స్ వెళ్లిపోవడం వారి ప్లేస్ లో కొత్తవారు రావడం కూడా జరిగాయి. ఇక టాలీవుడ్ లో త్రివిక్రమ్ లక్కీ ఛాంప్ అంటే పూజా హెగ్డే అనే చెప్పుకొస్తారు. అరవింద సమేత, అల వైకుంఠపురం చిత్రాలతో వీరు హిట్ కాంబోగా నిలిచారు. నిజం చెప్పాలంటే మొదటి నుంచి కూడా త్రివిక్రమ్ కి ఎలాంటి క్యాస్టింగ్ తీసుకోవాలో అనేదానిమీద మంచి పట్టే ఉంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో త్రివిక్రమ్ కాంప్రమైజ్ అయ్యిందే లేదు. అందం, అభినయం కలిసి ఉన్న హీరోయిన్ ని త్రివిక్రమ్ ఎంచుకుంటాడు. మెయిన్ హీరోయిన్ మాత్రమే కాకుండా సెకండ్ హీరోయిన్ కూడా.. అది కూడా చిన్న పాత్ర అయినా సరే స్టార్ హీరోయిన్నే ప్రిఫర్ చేస్తాడు.త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ అంటే పాత్ర ఎలాంటిదైనా సరే గుర్తింపు వస్తుందని వెంటనే ఓకే చెప్పేస్తారు హీరోయిన్లు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు త్రివిక్రమ్ మూవీస్ లో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించారు.
Rajinikanth: జైలర్ కాదు… ఇప్పుడు గవర్నర్ రజనీకాంత్..?
ఇక ఈ లిస్టులోకి మీనాక్షి చౌదరి కూడా ఎంటర్ అయింది. ఇచట వాహనాలు నిలపరాదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ మీనాక్షి చౌదరి. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోలేకపోయినా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను మాత్రం అందుకుంది. రవితేజ, అడవి శేషు లాంటి హీరోలతో నటించి మీనాక్షి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. ఇక గుంటూరు కారం నుంచి పూజా హెగ్డే వైదొలిగిన తర్వాత ఆ ప్లేస్ ను రీప్లేస్ చేసే హీరోయిన్ ఎవరో అని అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ సమయంలోనే మీనాక్షి చౌదరి నీ దింపాడు త్రివిక్రమ్.. శ్రీ లీలను మెయిన్ హీరోయిన్ గా చేసి మీనాక్షి చౌదరిని సెకండ్ హీరోయిన్ గా పెట్టేసాడు. త్రివిక్రమ్ డైరెక్షన్, మహేష్ బాబు హీరో అనగానే మీనాక్షి సైతం పాత్ర ఏదైనా అని ఒప్పేసుకుందని టాక్. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ సైమా అవార్డ్స్ లో అదిరిపోయే అవుట్ ఫిట్ తో కుర్రకారు గుండెల్ని గుబ్బేలుమనిపించింది. రెడ్ డ్రెస్ లో ఎద అందాలను ఆరబోసి హాట్ మిర్చిగా మత్తెక్కించింది. ఆమెను చూసిన అభిమానులు గురూజీ టేస్ట్ ఉంటుంది రా చారి.. వేరే లెవెల్ అంతే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా మీనాక్షికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.