Meenakshi Chaudhary in Another Tollywood Big Project: ఉత్తరాది భామ మీనాక్షి టాలీవుడ్ లో పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులలో భారమవుతోంది. తెలుగులో ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఆమె ఖిలాడీ హిట్ లాంటి సినిమాలలో నటించి వరుస హిట్లను అందుకుంది. ఆ తర్వాత గుంటూరు కారం అనే సినిమాలో ఆమె సెకండ్ హీరోయిన్ పాత్ర చేసింది కానీ ఆ పాత్ర ఆమెకు కానీ సినిమాకి గాని పెద్దగా యూస్ అవ్వలేదు. ఇక ఆమె చేసిన సింగపూర్ సెలూన్ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయి మంచి కలెక్షన్స్ దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు ఆమె విజయ్ హీరోగా నటిస్తున్న గోట్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. గోట్ తర్వాత ఆమె వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మక్కా సినిమాతో పాటు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న లక్కీ భాస్కర్ అనే సినిమాలో నటిస్తోంది అలాగే విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న మరో సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.
Raja Singh: కేసీఆర్ లా రేవంత్ రెడ్డి సడెన్గా మారొద్దని విజ్ఞప్తి
ఈ ప్రాజెక్టులతో పాటు ఆమె మరొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో భాగమైనట్లు తెలుస్తోంది. వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా వచ్చే ఏడాది సంక్రాంతికి టార్గెట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా ఏప్రిల్ లేదా మే నెలలో షూటింగ్ వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఆమెకు హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మరో టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులో భాగమైంది. అంతేకాదు ఆమె విశ్వంభర సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కూడా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ సినిమాలో త్రిషతో పాటు మరో ఐదుగురు భామలకు నటించే అవకాశం ఉండగా వారిలో ఒకరిగా మీనాక్షి నటిస్తున్నట్లు తెలుస్తోంది.