Meena: ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ల హవానే నడుస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ఒకానొక సమయంలో హీరోయిన్స్ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసినవారు పెళ్లి తరువాత కొంత గ్యాప్ తీసుకొని మళ్లీ రీ ఎంట్రీలు ఇస్తున్నారు. స్టార్ హీరోలకు అమ్మగా, అత్తగా, అక్కగా కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇక ఇలా మెప్పిస్తున్న వారిలో మీనా కూడా ఒకరు. బాలనటిగా కెరీర్ ను మొదలుపెట్టిన మీనా.. ఇప్పటివరకు నటిస్తూనే ఉంది. పెళ్లి తరువాత కూడా ఆమె సినిమాను వదలలేదు. ఇక గతేడాది ఆమె జీవితంలో అనుకోని విషాదం చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యలతో మీనా భర్త సాగర్ మృతి చెందాడు. భర్త చనిపోయిన కొన్ని రోజులకే ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందని వార్తలు వచ్చాయి. ధనుష్ తో ఎఫైర్ ఉందని పుకార్లు మొదలయ్యాయి. అలాంటి పుకార్లను పట్టించుకోకుండా కూతురు కోసం.. ఆమె మళ్లీ మేకప్ వేసుకొని నటించడం మొదలుపెట్టింది.
తెలుగు, తమిళ్ భాషల్లో మంచి మంచి సినిమాలు చేస్తున్న మీనా.. అప్పుడప్పుడు జబర్దస్త్ షోకు జడ్జిగా వస్తూ ఉండేది. ఇక అదే అనుభవంతో మీనా మరో షోకు జడ్జిగా మారింది. అదే సూపర్ జోడీ. సెలబ్రిటీ రీల్ వర్సెస్ రియల్ కపుల్స్ తో మొదలయ్యే డ్యాన్స్ షో. ఇక తాజాగా మీనా ఈ షోకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది. ఛానెల్స్ వచ్చే సీరియల్స్ అన్నిరోజులు వస్తూ ఉన్నాయి.. ఆదివారం కూడా సీరియల్స్ ఏం చూస్తాం అని అసహనంగా చెప్పుకుంటున్న మీనాకు రజినీకాంత్.. డ్యాన్స్ గురించి చెప్పి స్టార్ట్ చేయమని అనడంతో.. ఇంట్లో ఉన్న రోజా స్టేజిమీద ప్రత్యేక్షమవుతుంది. జడ్జిగా నేను రెడీ.. సూపర్ జోడిలతో వచ్చేస్తాను అని చెప్పడంతో ప్రోమో ముగిసింది. ఇక ఈ షో జీ తెలుగులో ప్రారంభం కానుంది.మీనాకు డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ షోలో ఆమె జడ్జిగా ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.