Meena: ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ల హవానే నడుస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ఒకానొక సమయంలో హీరోయిన్స్ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసినవారు పెళ్లి తరువాత కొంత గ్యాప్ తీసుకొని మళ్లీ రీ ఎంట్రీలు ఇస్తున్నారు. స్టార్ హీరోలకు అమ్మగా, అత్తగా, అక్కగా కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇక ఇలా మెప్పిస్తున్న వారిలో మీనా కూడా ఒకరు.