Aishwarya Lakshmi: ‘మట్టి కుస్తీ’ నాకో సవాల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Matti Khusthi: హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి కుస్తీ. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను డిసెంబర్ 2న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ విశేషాలను ఆమె మీడియాతో పంచుకుంది. తొలుత ఈ సినిమాను అంగీకరించిన వివరాలు చెబుతూ, ”మూడేళ్ళ క్రితం కోవిడ్ కి ముందే ‘మట్టి కుస్తీ’ కథ విన్నాను. నాకు చాలా నచ్చింది. అయితే ఇందులో హీరోయిన్ పాత్ర చాలా సవాల్ తో కూడుకున్నది. ఆ పాత్రకు న్యాయం చేయలేనని అనిపించింది. ఇదే విషయం దర్శకుడికి చెప్పాను. తర్వాత కోవిడ్ వచ్చింది. మూడేళ్ళ తర్వాత స్క్రిప్ట్ మళ్ళీ నా దగ్గరికే వచ్చింది. ఈ గ్యాప్ లో కొన్ని సినిమాలు చేయడం వలన కాన్ఫిడెన్స్ వచ్చింది. దీంతో ‘మట్టి కుస్తీ’ ని చేయాలని నిర్ణయించుకున్నా” అని తెలిపింది.
ఇందులో ఐశ్వర్య లక్ష్మీ పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. దాని గురించి తెలుపుతూ, ”ఇందులో నేను పోషించిన పాత్ర చాలా ఫిజికల్ వర్క్ ని డిమాండ్ చేస్తుంది. దానికి చాలా కావాలి. ట్రైలర్ లో స్టంట్స్ చూసే వుంటారు. ఎమోషనల్ సీన్స్ ని చేయడం నాకు ఇష్టమే. కామెడీ అనేది నా వరకూ చాలా కష్టం. మొదటి సారి ఇందులో కామెడీని ప్రయత్నించాను. ఇదివరకు నేను చేసిన పాత్రల్లో కామెడీ లేదు. ‘మట్టి కుస్తీ’ నాకు ఓ సవాల్. ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో తెలీదు కానీ దర్శకుడు నా ఫెర్ ఫార్మెన్స్ పట్ల చాలా ఆనందంగా వున్నారు. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం వుంది. మూవీ గురించి చెప్పాలంటే, ఇదో ఫ్యామిలీ డ్రామా. ఇది భార్యభర్తల కుస్తీ. ఇగో, వినోదం, కుస్తీ… అన్నీ ఎలిమెంట్స్ వుంటాయి. ప్రతి ఒక్కరూ ఈ కథకు కనెక్ట్ అవుతారు. ఇంత చక్కని ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం వున్న చిత్రం ఈ మధ్య కాలంలో రాలేదు. ఆడ, మగ సమానమే అనే సందేశాన్ని చాలా వినోదాత్మకంగా చూపించాం. పైసా వసూల్ మూవీ అని చెప్పొచ్చు” అని అన్నారు.
Also Read
- Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
- Varanasi: మహేష్ బాబు బర్త్‌డే రోజు రాజమౌళి ఎందుకు సైలెంట్? ‘వారణాసి’పై జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదేనా?
- AR Ameen: రెహమాన్ కొడుక్కి తృటిలో తప్పిన ముప్పు!
- Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
హీరో విష్ణు విశాల్, నిర్మాత రవితేజ గురించి చెబుతూ, ”విష్ణు విశాల్ స్ఫూర్తినిచ్చే వ్యక్తి. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ది బెస్ట్ కోసం ప్రయత్నిస్తుంటారు. ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పటి నుండి ఆయన సరిగ్గా నిద్రకూడా పోలేదు. ఆయనకు కథల ఎంపికలో మంచి అభిరుచి వుంది. ఆయన లాంటి విజన్ చాలా తక్కువ మందిలో కనిపిస్తుంటుంది. ఆయన నుండి చాలా నేర్చుకున్నాను. నటుడిగా, నిర్మాతగా ఆయన ప్రయాణం అద్భుతం. ఆయనతో పని చేయడం చాలా ఆనందం గా వుంది. అలానే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న తెలుగు స్టార్ రవితేజా గారు ఎప్పుడూ షూటింగ్ కు రాలేదు. విష్ణు విశాల్ ను పూర్తిగా నమ్మి, కావాల్సింది సమకూర్చారంతే. ఆయన ఫైనల్ అవుట్ పుట్ చూసి చాలా హ్యాపీ ఫీలయ్యారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే రవితేజా గారిని కలిశాను” అని చెప్పింది.
తెలుగు ఆడియెన్స్ గురించి ఐశ్వర్య లక్ష్మీ మాట్లాడుతూ, ”నాకు సాయిపల్లవి, సత్యదేవ్ తో చక్కని పరిచయం ఉంది. తెలుగు ప్రేక్షకులు సినిమాని గొప్పగా ప్రేమిస్తారు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ గా ఎదిగింది. టాలీవుడ్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని రూల్ చేస్తోంది. తెలుగు నుండి వస్తున్న ప్రతి ప్రాజెక్ట్ కు గొప్ప ఆదరణ వస్తోంది. చాలా పరిశ్రమలు తెలుగు ఇండస్ట్రీని ఫాలో అవ్వడం గమనించాను. తెలుగు ప్రేక్షకులకు సినిమా పట్ల వున్న అభిమానం, ప్రేమే దీనికి కారణం. నేనూ తరచూ తెలుగు సినిమాలు చూస్తాను. అందరూ ఇష్టమే. ఇక సినిమాల సెలక్షన్ అంశానికి వస్తే… తమిళ్, తెలుగు, మలయాళీ ప్రేక్షకుల అభిమానం నాకు లభించింది. సినిమాల ఎంపికలో నాకు ఎలాంటి తొందరలేదు. మంచి కథ, గుర్తుపెట్టుకునే పాత్రలు చేయాలనేది నా ప్రయత్నం” అని తెలిపింది.
తాజావార్తలు
-
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
-
Shehnaaz Gill : షూటింగ్లో ప్రమాదం: పొరపాటున ముక్కు పుడక మింగేసిన నటి!
-
Palamuru Rangareddy Project: పాలమూరుకు కేంద్రం షాక్.. జాతీయ హోదాపై క్లారిటీ.!
-
SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!