The Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ టీజర్ తాజాగా రిలీజ్ అయింది. హర్రర్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. తాజాగా మూవీ గురించి డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. నేను గోపీచంద్ తో మూవీ చేస్తున్నప్పుడే రాజాసాబ్ కు ప్రభాస్ ఓకే చెప్పారు. కానీ గోపీచంద్ తో చేసిన మూవీ ప్లాప్ కావడంతో నేనే వెనకడుగు వేశాను. ప్రభాస్ మాత్రం నాకు ధైర్యం చెప్పి మూవీ చేద్దాం అన్నారు.
Read Also : SKN : ఎస్కేఎన్ చెప్పిన ఆ నెగటివ్ నిర్మాత ఎవరు?
ఆయన చాలా మంచి మనిషి. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లను పెట్టగలవా డార్లింగ్ అన్నారు. మీ రేంజ్ కు ఇద్దరేంటి సార్.. ముగ్గురిని పెడుతా అని చెప్పా. చెప్పినట్టే ముగ్గురు హీరోయిన్లతో మూవీని తీశా. హీరోయిన్లతో ప్రభాస్ పాత్రకు మంచి రాపో ఉంటుంది. ఇంతకు ముందు ప్రభాస్ చేసిన సినిమాల్లో హీరోయిన్లతో కనెక్షన్ ఉండదు.
ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. రొమాన్స్, కామెడీ, హర్రర్ కలగలిపి మూవీని తీశాం. ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చతుందనే నమ్మకం నాకు ఉంది. ప్రభాస్ నన్ను నమ్మి ఈ సినిమా చేసినందుకు చాలా థాంక్స్. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను’ అని తెలిపారు.
Read Also : Kannappa Vs Kubera : కన్నప్ప వర్సెస్ కుబేర.. ఏ ట్రైలర్ బాగుందంటే..?