Manoj Muntashir Accepts His Mistakes And Apologies Over Adipurush Issue: తమ జీవితంలో ప్రతిఒక్కరూ తప్పు చేస్తారు కానీ, దాన్ని ఒప్పుకొనే సాహసం మాత్రం ఎవ్వరూ చేయరు. ఎలాగోలా దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలే చేస్తారే తప్ప.. తాము చేసిన తప్పుని ఒప్పుకోరు, పశ్చాత్తాపమూ చెందరు. కానీ.. కొందరు మాత్రం తాము చేసిన ఒప్పుకునే సాహసాన్ని కలిగి ఉంటారు. అఫ్‌కోర్స్.. మొదట్లో ఆ తప్పుని గ్రహించకపోయినా, ఆ తర్వాత జరిగిన నష్టాన్ని అర్థం చేసుకొని, తప్పు ఒప్పేసుకుంటారు. ఇప్పుడు ఆదిపురుష్ రైటర్ మనోజ్ ముంతశిర్ కూడా అదే పని చేశాడు. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రకు తాను రాసిన అభ్యంతకరమైన డైలాగ్స్ విషయంలో తన తప్పు ఒప్పుకొని, క్షమాపణలు కోరాడు.
Man Eats Wifes Brain: భార్య మెదడును తిన్న మెక్సికన్ వ్యక్తి.. పుర్రెను యాష్‌ట్రేగా..
‘ఆదిపురుష్’లో ఇంద్రజిత్తుడు తన తోకకి నిప్పు అంటించినప్పుడు.. హనుమంతుడు ఒక డైలాగ్ చెప్తాడు. ‘నా తోకకు కట్టిన గుడ్డ నీ బాబుది, దానికి రాసిన చమురు నీ బాబుది, నిప్పు కూడా నీ బాబుదే’ అంటూ సాగే ఆ డైలాగ్.. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసింది. హనుమంతుడి నోట ఇలాంటి అభ్యంతకరమైన డైలాగ్ చెప్పించడమేంటని.. తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మొదట్లో ఈ వివాదం చెలరేగినప్పుడు.. తన తప్పు లేదన్నట్టుగా రైటర్ మనోజ్ ముంతశిర్ వ్యవహరించాడు. ఎంతో నిశితంగా ఆలోచించాకే ఈ సంభాషణలు రాశానని, పాత్రల మధ్య వైవిధ్యం చూపించాలనే ఉద్దేశంతోనే అలా రాయడం జరిగిందని చెప్పుకొచ్చాడు. అయినా ప్రజలు నుంచి విమర్శలు తగ్గలేదు. ఎంత వైవిధ్యం చూపించాలంటే మాత్రం, మరీ ఇలాంటి వివాదాస్పద డైలాగ్ పెడతారా? అంటూ ఎగబడ్డారు.
Delhi : పోర్న్ వీడియోలను చూడాలని భార్యను బలవంతం పెట్టిన భర్త .. కట్ చేస్తే సీన్ రివర్స్..
ఈ నేపథ్యంలోనే.. రైటర్ మనోజ్ తాజాగా క్షమాపణలు కోరాడు. ‘‘ఆదిపురుష్ సినిమా వల్ల ప్రజల భావోద్వేగాలు దెబ్బతిన్నాయని నేను అంగీకరిస్తున్నాను. అందుకు నేను నా రెండు చేతులు జోడించి, మీ అందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్తున్నాను. ప్రభు బజరంగ్‌బలి మమ్మల్ని ఐక్యంగా ఉంచి.. మన పవిత్రమైన సనాతన, గొప్ప దేశానికి సేవ చేసే శక్తిని ప్రసాదించుగాక’’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. ఎట్టకేలకు ఇక్కడితోనైనా ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడుతుందని మనం భావించొచ్చు.