Manchu Manoj : కొన్ని రోజులుగా మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ మధ్య ఏ స్థాయిలో గొడవలు జరుగుతున్నాయో చూస్తున్నాం. ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే దాకా పరిస్థితి వెళ్లింది. ఈ గొడవలు ఒక పక్క జరుగుతూ ఉండగానే.. ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉంటున్నారు. విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప కోసం కెరీర్ లోనే భారీ బడ్జెట్ పెట్టాడు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్లు యాక్ట్ చేస్తుండటంతో అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఏప్రిల్ 25న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తి అయిపోయింది.
Read Also : Nagpur Violence: నాగ్‌పూర్ హింస ఒక “కుట్ర”.. “ఛావా”పై షిండే కామెంట్స్..
పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో మనోజ్ కూడా ఏప్రిల్ 25కే రావాలని డిసైట్ అయినట్టు తెలుస్తోంది. మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటించిన మూవీ భైరవం. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ మూవీని ఏప్రిల్ 25న రిలీజ్ చేయాలని చూస్తున్నారంట. అన్ని పనులు కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. టీజర్ తో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
ముగ్గురు హీరోలు ఉండటంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. ఒకవేళ ఈ మూవీని కచ్చితంగా ఏప్రిల్ 25కే రిలీజ్ చేస్తే మాత్రం కన్నప్పకు ఎఫెక్ట్ పడుతుంది. అసలే అన్న మీద కోపంతో ఉన్న మనోజ్.. వెనక్కు తగ్గకపోవచ్చు. అన్న మీద పైచేయి సాధించాలనే తపనతో కచ్చితంగా అదే డేట్ కు రిలీజ్ చేసేలా ఉన్నాడు. రేపో, మాపో అధికారిక ప్రకటన కూడా రావచ్చు. మరి కన్నప్పను మనోజ్ ఏ స్థాయిలో దెబ్బకొడుతాడో చూడాలి.