Manoj : మనోజ్ ఈ నడుమ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. మనోజ్, సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న ఈ సినిమాను విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ మే 30న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా మనోజ్ ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు. ‘నేను ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చేయలేదు. కానీ నన్ను తొక్కేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. నేను వాటిని మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు.
Read Also : Theater Strike : రేపు మరోసారి నిర్మాతల మీటింగ్.. ఏం తేలుస్తారో?
ఆ తర్వాత చాలా బాధపడ్డాను. నన్ను విష్ణు వ్యక్తిగతంగా బాధపెట్టాలని చూశాడు. నా బట్టలు, కార్లు అన్నీ ధ్వంసం చేయించాడు. పోనీలే అనుకున్నాను. కానీ నా భార్య వాళ్ల అమ్మ, నాన్న జ్ఞాపలను దాచుకుంటే వాటిని కూడా ధ్వంసం చేశాడు. అది చాలా బాధగా అనిపించింది. అందుకే కన్నప్ప మూవీపై మాట్లాడాను. నా మనసులో ఉన్నది చాలా సార్లు మీడియా ముందే చెప్పుకున్నాను. శివయ్యా అంటూ మొన్న ఈవెంట్ లో కన్నప్ప గురించి అన్నాను. ఆ తర్వాత అనకుండా ఉండాల్సింది అని చాలా బాధపడ్డాను.
ఎందుకంటే అది ఒక మూవీ. ఆ మూవీ కోసం ప్రభాస్, మోహన్ లాల్, కాజల్, అక్షయ్ కుమార్ లాంటి వాళ్లు స్టార్లు నటించారు. ఎంతో మంది కష్టపడ్డారు. వాళ్ల అభిమానులు నా మాటల వల్ల బాధపడి ఉంటారేమో అనిపించింది. ఒక్కడి వల్ల అంత మంది కష్టాన్ని తక్కువ చేయొద్దు. నేను అలాంటి కామెంట్లు చేసినందుకు ఆ మూవీ టీమ్ అందరికీ క్షమాపణలు చెబుతున్నాను’ అంటూ మనోజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Read Also : Vishal : విశాల్ పెళ్లి ఆలస్యానికి ఇంత పెద్ద కారణం ఉందా..?