Manjummel Boys is a new Industry Hit for Malayalam cinema: ఈ సంవత్సరం భారతీయ చలనచిత్ర రంగంలో అత్యధికంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్ర పరిశ్రమ మాలీవుడ్. ఫిబ్రవరిలో మలయాళ సినిమాకు హ్యాట్రిక్ హిట్స్ అందించిన సినిమాలే ఇందుకు ప్రధాన కారణం. నస్లెన్ – మమితా బైజు నటించిన గిరీష్ AD రొమాంటిక్ కామెడీ ప్రేమలు, మమ్ముట్టి నటించిన రాహుల్ సదాశివన్ యొక్క హారర్ థ్రిల్లర్ భ్రమయుగంతో పాటు చిదంబరం డైరెక్ట్ చేసిన సర్వైవల్ థ్రిల్లర్ మంజుమ్మల్ బాయ్స్ హ్యాట్రిక్ హిట్స్ గా నిలిచాయి. ఇందులో భ్రమ యుగం 60 కోట్లకు పైగా వసూలు చేయగా, ప్రేమలు 100 కోట్లను దాటుకుని ముందుకు వెళుతోంది. అయితే ఆసక్తికరంగా మలయాళ సినిమా చరిత్రలో మంజుమ్మల్ బాయ్స్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
Viral Video : ఓరి నాయనో ఏందీ మావ ఇది.. మందుబాబులకు కిక్ ఇచ్చే ఐస్ క్రీమ్..
మంజుమ్మల్ బాయ్స్ మలయాళంలో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది, జూడ్ ఆంథోనీ జోసెఫ్ ఫిల్మ్ 2018ని అధిగమించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 175 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇతర దక్షిణ భారత భాషా చిత్రాలు పెద్దగా హిట్ అవకుండా కొట్టుమిట్టాడుతున్న ఈ ఏడాది ప్రారంభంలో మంజుమ్మల్ బాయ్జ్ ఆ విభాగంలోనూ రికార్డు సృష్టించింది. మంజుమ్మల్ బాయ్స్ ప్రస్తుతం ఈ సంవత్సరం విడుదలైన దక్షిణ భారత చిత్రాలలో అతిపెద్ద బాక్సాఫీస్ హిట్స్ జాబితాలో రెండవ స్థానంలో ఉంది. తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాను అధిగమించి మంజుమ్మల్ బాయ్స్ రెండో స్థానానికి చేరుకుంది. గుంటూరు కారం గ్లోబల్ క్లోజింగ్ బాక్సాఫీస్ 170 కోట్లు. కాగా, ఈ ఏడాది టాప్ 10 సౌత్ ఇండియన్ సినిమాల జాబితాలో మలయాళం నుంచి ఐదు సినిమాలు ఉన్నాయి. ఇక మొదటి స్థానంలో హనుమాన్ సినిమా ఉండడం గమనార్హం.