మంచు హీరో విష్ణు ప్రస్తుతం ‘గాలి నాగేశ్వరరావు’ చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. ఈషాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ కథను అందించడంతో పాటు సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో విష్ణు సరసన హాట్ బీయూటీస్ సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకొంటుంది. ఇక షూటింగ్ మాట అలా ఉంచి ఇద్దరు హీరోయిన్స్ తో మంచు విష్ణు చేస్తున్న ఫన్ వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో మంచు విష్ణు వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అంతకు ముందు సన్నీ ని ఆట పట్టించడం, ఆమెతో పరోటాలు చేయిస్తూ తెలుగు నేర్పించడం లాంటి వీడియోలను విష్ణు అభిమానులతో పంచుకున్నాడు. ఇక తాజాగా విష్ణు బ్యాచ్ లో పాయల్ కూడా జాయిన్ అయ్యింది. ఇద్దరు హాట్ బ్యూటీస్ తో విష్ణు సరదాగా ఆడుకుంటున్నాడు.
షూటింగ్ గ్యాప్ లో పాయల్, సన్నీని విష్ణు ఆటపట్టించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో నీ ఫేవరేట్ ఎవరు అని అడుగగా.. పాయల్ ఉన్నప్పుడు ఆమె పేరు, సన్నీ ఉన్నప్పుడు ఆమె పేరు చెప్పుకొని తప్పించుకున్నాడు. ఇక ఇద్దరు ఉన్నప్పుడు నీ ఫెవరేట్ ఎవరు అని అడుగగా.. అలియా భట్ అని చెప్పడం తో హాట్ బ్యూటీస్ ఇద్దరికి కోపం నషాళానికి ఎక్కడం, వెంటనే పక్కనున్న పిల్లోస్ తో విష్ణును కొట్టడం.. వారినుంచి విష్ణు తప్పించుకొని పరిగెత్తడం కనిపించింది. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. విష్ణు అన్న పెట్టి పుట్టాడు.. ఇద్దరు హాట్ భామలతో ఆడుకుంటున్నాడు అని కొందరు.. అన్న మీరు షూటింగ్ చేస్తున్నారా.. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నారా..? అని మరికొందరు కామెంట్స్ పెడుతుండగా.. ఇంకొందరు ఆహా సినిమాకు ఇప్పటినుంచే మంచి ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు అని అంటున్నారు. ఏదిఏమైనా ఇద్దరు హాట్ భామలతో ‘మా’ ప్రెసిడెంట్ ఆటలు భలే బావున్నాయి కదా..