Manchu Vishnu : మంచు విష్ణు కన్నప్ప మూవీ ప్రమోషన్లలో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమా నా లైఫ్ లోనే అత్యంత కీలకం. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే కన్నప్ప మరో ఎత్తు. దీన్ని డబ్బుల కోసమో, ఫేమ్ కోసమే తీయలేదు. కన్నప్ప గురించి ప్రజలకు తెలియాలి అనే తీశాను. ఈ సినిమాలో నేను కూడా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేశాను.
Read Also : Manchu Vishnu : ఎక్కడెక్కడ అప్పులు చేశానో వాళ్లకు తెలుస్తుంది.. జీఎస్టీ సోదాలపై విష్ణు..
ఒకవేళ నేను డైరెక్టర్ కావాల్సి వస్తే నా ఫస్ట్ సినిమా అమితాబ్ బచ్చన్ గారితోనే చేస్తాను. ఆయన పనితీరును ఇండియా మొత్తం మెచ్చుకుంటుంది. ఆయనతో చేయడం నా కల. నేను నటుడిగా మరిన్ని విభిన్న పాత్రలు చేయాలని అనుకుంటున్నాను. గతంలో ఏం చేశానో ఇప్పుడు ఏం చేస్తున్నానో నాకు క్లారిటీ ఉంది. ఇప్పటి వరకు మీరు చూడని విష్ణును కన్నప్ప సినిమాలో చూస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు మంచు విష్ణు.
Read Also : Mahesh Babu : అనగనగా మూవీపై మహేశ్ బాబు ప్రశంసలు..