Mahesh Babu : సుమంత్ హీరోగా వచ్చిన అనగనగా మూవీ ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు దీనిపై స్పెషల్ ట్వీట్ చేశారు. అనగనగా మూవీ సింపుల్ గా సూపర్ గా ఉంది. మూవీని ఎమోషనల్ గా అందంగా చూపించారు. ఈ మూవీని ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలి. దీనికోసం మీరు టైమ్ కేటాయించాల్సిందే. మూవీ టీమ్ అందరూ అద్భుతంగా పనిచేశారు. సుమంత్ పనితీరు గొప్పగా ఉంది. మూవీ టీమ్ అందరికీ నా ప్రేమ ఎప్పటికీ ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు మహేశ్.
Read Also : Salman khan : స్టార్ హీరోయిన్ బాత్రూమ్ లో సల్మాన్ ఖాన్ పోస్టర్..
ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేశ్ బాబు ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సినిమాపై ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఫారెన్ షెడ్యూల్ ఉంటుందనే టాక్ నడుస్తోంది. ఫుల్ అడ్వెంచర్ మూవీగా ఇది రాబోతోంది. ఇక అనగనగా విషయానికి వస్తే తండ్రి, కొడుకుల మధ్య ప్రేమను చూపిస్తూ.. ఇప్పుడున్న విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపించింది ఈ సినిమా. ఓటీటీలో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.
Read Also : Sitaare Zameen Par : అమీర్ ఖాన్ మూవీ చూసిన రాష్ట్రపతి