Manchu Manoj: యంగ్ హీరో మంచు మనోజ్ ఉస్తాద్ షోతో హోస్ట్ గా మారిన విషయం తెల్సిందే. ఈటీవీ విన్ లో ఈ గేమ్ షో స్ట్రీమింగ్ అవుతుంది. ఆటపాటలతో పాటు ఉత్కంఠ రేకెత్తించే గేమ్స్ తో అదిరిపోతోంది. వచ్చే గెస్ట్ లను తనదైన మాటకారి తనం, చలాకీతనంతో మనోజ్ ఒక ఆట ఆడేసుకుంటున్నాడు. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ షోను నిర్వహిస్తుండడంతో పెద్ద పెద్ద స్టార్లే ఈ షోకు వస్తున్నారు. నాని తో ఉస్తాద్ స్టార్ట్ అయ్యింది. ఆ తరువాత సిద్దు జొన్నలగడ్డ, రానా వచ్చి సందడి చేసారు. ఇక నిన్నటికి నిన్న ఒక స్టార్ హీరోను మనోజ్ హాగ్ చేసుకొని తరువాత గెస్ట్ ఎవరు గెస్ చేయండి అని పజిల్ పెట్టాడు. అందరూ.. మాస్ మహారాజా రవితేజ అని చెప్పగా.. కొంతమంది మాత్రం మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అని చెప్పుకొచ్చారు.
మనోజ్ కు తేజ్ కు మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. దీంతో మెగా మేనల్లుడును ఉస్తాద్ షోకు రప్పించారని అనుకున్నారు. అయితే అది తప్పు . చాలామంది పాళ్ళలో కాలేశారు. ఆ గెస్ట్ రవితేజ కాదు, సాయి ధరమ్ తేజ్ కాదు.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్. నేడు విశ్వక్ ఫోటోను మేకర్స్ రిలీజ్ చేయడంతో క్లారిటీ వచ్చింది. ఇక విశ్వక్ కూడా ఆహా లో హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఒక హోస్ట్.. ఇంకొక షోకు గెస్ట్ గా వచ్చాడు. ప్రస్తుతం విశ్వక్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కు సిద్ధమవుతుండగా మరో రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. మరి ఈ షోలో మనోజ్.. విశ్వక్ తో ఎలా ఆడుకుంటాడో చూడాలంటే జనవరి 4 వరకు ఆగాల్సిందే.