గడిచిన 24 గంటలుగా సోషల్ మీడియాలో, న్యూస్ ఛానెల్స్ లో, కామన్ పబ్లిక్ లో వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు ‘మంచు ఫ్యామిలీ’. మంచు మోహన్ బాబు వారసులు విష్ణు, మనోజ్ లు మధ్య గొడవ బట్టబయలు అయ్యి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. గత కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నాయి అనే విషయం తెలిసినా ఎవరికి వాల్ సైలెంట్ గా ఉన్నారు కానీ పబ్లిక్ గా ఎలాంటి కామెంట్స్ చెయ్యలేదు. తాజాగా మంచు విష్ణు తన మనుషులని కొట్టడానికి వచ్చాడు, తరచుగా ఇంటికి వచ్చి కొడుతూ ఉంటాడు అని మంచు విష్ణు వీడియోని మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అంతే మంచు ఫ్యామిలీ అంతర్గత విషయాలు ఒక్కసారిగా బట్టబయలు అయ్యాయి. అన్నదమ్ముల మధ్య గొడవకి సరైన కారణాలు క్లారిటీ ఎవరికీ తెలియదు కానీ మంచు ఫ్యామిలీలో ప్రస్తుతం సర్దుబాటు చర్యలు జరుగుతున్నాయి అనే విషయం మాత్రం స్పష్టంగా అర్ధమవుతుంది.
ఇదిలా ఉంటే ఈ గొడవ జరిగిన తర్వాత మంచు మనోజ్ సోషల్ మీడియాలో మోటివేషన్ కొటేషన్స్ ని పోస్ట్ చేస్తూ ఉన్నాడు. ఏది కరెక్ట్ అయితే దాని కోసమే పోరాడుతున్నాను, నెగిటివిటి క్రియేటివిటీకి బిగ్గెస్ట్ ఎనిమీ అంటూ కొటేషన్స్ ని మంచు మనోజ్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నాడు. ఈ పోస్ట్స్ చూసిన మంచు మనోజ్ ఫాన్స్… “నువ్వు పర్ఫెక్ట్ గా దృష్టి పెట్టి సినిమాలు చెయ్ అన్నా, మేమంతా సపోర్ట్ చేస్తాం. నువ్వు ఎలాంటి తప్పు చేసి ఉండవు, నీకు మేము అండగా ఉంటాం అన్న” అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. మంచు మనోజ్ ఇటివలే భుమా మౌనిక రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి సమయం నుంచే మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి అనే విషయం బయట ప్రపంచానికి తెలియడం మొదలయ్యింది.
Live and let live 🙏🏼❤️ Love you all with all my heart. #ManchuManoj pic.twitter.com/ypecRuZwLG
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 25, 2023