నటి మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దక్ష – ది డెడ్‌లీ కాన్స్పిరసీ’ ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది. వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మించాయి. సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అప్పటికే మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు అక్టోబర్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతూ, OTT టాప్ ట్రెండ్స్‌లో దూసుకుపోతోంది.
Also Read : Euphoria: క్రిస్మస్ బరిలో భూమిక, సారా అర్జున్ ‘యుఫోరియా’..
ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కింది. ఇందులో మంచు లక్ష్మి ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది. న్యాయానికి అంకితమైన ఆఫీసర్‌గా ఆమె చూపించిన నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా క్రైమ్ ఛేజ్ సీన్స్‌లో ఆమె ఎనర్జీ, డైలాగ్ డెలివరీ అదిరిపోయాయి. ఈ సినిమాలో మోహన్ బాబు ఒక కీలక పాత్రలో కనిపించి తన స్టైల్లో స్క్రీన్‌ను ఆకట్టుకున్నారు. అలాగే సముద్రఖని, రంగస్థలం మహేష్, విశ్వంత్ దుద్దుంపూడి, సిద్ధిఖీ వంటి నటుల ప్రదర్శనలు కూడా సినిమాకు బలాన్ని చేకూర్చాయి. థ్రిల్లింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సస్పెన్స్ నడిపే స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను సీటు ఎడ్జ్‌లో కూర్చోబెట్టేలా చేశాయి.
మొత్తం మీద ‘దక్ష’ మంచి టెన్షన్‌తో, ఎమోషన్‌తో సాగే సైకలాజికల్ థ్రిల్లర్‌గా నిలిచింది. అంతే కాదు తాజా సమాచారం ప్రకారం, ఇప్పుడు ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే టాప్ ట్రెండింగ్ మూవీస్ లిస్ట్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. మంచు లక్ష్మి ఈ సినిమా తర్వాత మరోసారి సీరియస్ రోల్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ‘దక్ష’ థియేటర్లలో విజయాన్ని అందుకున్న తర్వాత, ఇప్పుడు ఓటీటీ వేదిక పై కూడా బాగా దూసుకుపోతోంది.