Euphoria: క్రిస్మస్ బరిలో భూమిక, సారా అర్జున్ ‘యుఫోరియా’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ మరోసారి కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘యుఫోరియా’ ఈ క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో భూమిక చావ్లా, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. గుణశేఖర్ కుటుంబ సభ్యులే అయిన నీలిమ గుణ మరియు యుక్తా గుణ ఈ సినిమాను ఎంతో ప్రేమతో నిర్మించారు.
Also Read : Ram Pothineni : దాని కారణంగా.. ఒక్క రాత్రిలో మా కుటుంబం రోడ్డున పడిపోయింది
Also Read
- Ajith Kumar: యూరప్ ఎండ్యూరెన్స్ రేస్‌లో ప్రమాదం.. అదుపుతప్పి మరో కారును వేగంగా ఢీకొట్టిన అజిత్!
- Toxic Advance Booking: రిలీజ్‌కు ముందే యష్ 'టాక్సిక్' రికార్డు.. 'ధురందర్'ను దాటేసిన బుకింగ్స్!
- Raaka: ‘బన్నీని ఇలా ఎప్పుడూ చూడలేదు’.. 'రాకా' సెట్ చూసి షాకైన మంచు లక్ష్మి
- Regina Cassandra : హీరోయిన్ నుండి విలన్ పాత్రలకు షిఫ్ట్ అయిన రెజీనా కాసాండ్రా
దీపావళి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించబడింది. డిసెంబర్ 25 అంటే క్రిస్మస్ గిఫ్ట్‌లా ప్రేక్షకులకు ఈ సినిమా రానుంది. ఇందులో లిఖిత యలమంచలి, అడ్డాల పృథ్వీరాజ్, కల్పలత వంటి నటులు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సినిమా గురించి టీమ్ చెబుతూ .. “నేటి యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకూ దగ్గరయ్యేలా ఒక సెన్సిబుల్ కథను తీసుకున్నాం. కథలో వినోదం, భావోద్వేగం, సందేశం అన్నీ మిళితమై ఉంటాయి. ముఖ్యంగా భూమిక పోషించిన పాత్ర చాలా శక్తివంతంగా, భావోద్వేగంగా ఉంటుంది. ఆమె ప్రదర్శన సినిమాలో ఒక హైలైట్‌గా నిలుస్తుంది” అని పేర్కొన్నారు. మనకు తెలిసి గుణశేఖర్ సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈసారి కూడా కొత్తగా ఆలోచించి, ఒక సాఫ్ట్ ఎమోషనల్ డ్రామా చేయడం గమనార్హం. ఇక భూమిక, సారా అర్జున్‌ల కలయిక కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. మొత్తానికి ‘యుఫోరియా’ ఈ క్రిస్మస్‌కి మంచి ఫ్యామిలీ ఎమోషన్‌తో పాటు, ఓ స్ఫూర్తిదాయకమైన సందేశం అందించబోతుందనే టాక్ ఫిలింనగర్‌లో వినిపిస్తోంది.
తాజావార్తలు
-
Ajith Kumar: యూరప్ ఎండ్యూరెన్స్ రేస్‌లో ప్రమాదం.. అదుపుతప్పి మరో కారును వేగంగా ఢీకొట్టిన అజిత్!
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. సచిన్, సెహ్వాగ్ తర్వాత..!
-
Vivo V70 Lite 4G: వివో V70 Lite 4G వచ్చేసింది.. 8100mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే
-
Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
-
Toxic Advance Booking: రిలీజ్‌కు ముందే యష్ ‘టాక్సిక్’ రికార్డు.. ‘ధురందర్’ను దాటేసిన బుకింగ్స్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!