Manchu Lakshmi : నటి మంచు లక్ష్మీ సూపర్ స్టార్ మహేశ్ బాబు మీద షాకింగ్ కామెంట్స్ చేసింది. చాలా గ్యాప్ తర్వాత ఆమె నుంచి దక్ష–ది డెడ్‌లీ కాన్సిపిరసీ’ అనే మూవీ రాబోతోంది. ఈ నెల 19న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు స్లీవ్ లెస్ బట్టలపై ప్రశ్న ఎదురైంది. 50 ఏళ్ల వచ్చిన తర్వాత ఒక 12 ఏళ్ల కూతురు ఉన్న టైమ్ లో.. ఇలాంటి బట్టలు వేసుకోవడం అవసరమా అనే కామెంట్స్ వచ్చినప్పుడు మీకేమనిపిస్తుంది అని ప్రశ్నించారు. దానికి ఆమె ఘాటుగా రిప్లై ఇచ్చింది.
Read Also : Mirai – Little Hearts : లిటిల్ హార్ట్స్ ను బతికించిన మిరాయ్ నిర్ణయం..
మీరు ఇదే ప్రశ్న మహేశ్ బాబును అడుగుతారా అంటూ ఆమె షాకింగ్ రిప్లై ఇచ్చింది. 50 ఏళ్లు వచ్చిన మహేశ్ బాబు షర్టు విప్పి తిరిగితే తప్పు కాదా.. నేను వేసుకుంటే తప్పు ఎలా అవుతుంది. ఒక మహిళను అడిగే ప్రశ్న అబ్బాయిలను ఎందుకు అడగరు అంటూ ఘాటుగా స్పందించింది. నేను అమ్మాయిలకు ఒక ఇన్ స్పిరేషన్ లా ఉండాలి అనుకుంటాను. మంచు లక్ష్మీ వేసుకుంది నేను వేసుకుంటే తప్పేంటి అని వారు అనుకోవాలి. అంతే గానీ.. అమ్మాయిలకు నేను భయాన్ని నేర్పించను అంటూ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మీ. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చకు దారి తీశాయి. ఇదే విషయంపై మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.