Mirai – Little Hearts : యంగ్ హీరో తేజ సజ్జా నటించిన మిరాయ్ దుమ్ము లేపుతోంది. బ్లాక్ బస్టర్ టాక్ తో థియేటర్లలో ఆడియెన్స్ నిండిపోతున్నారు. అయితే సినిమాను సెప్టెంబర్ 5న రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ అదే రోజున అనుష్క నటించిన భారీ బడ్జెట్ మూవీ ఘాటీ, శివకార్తికేయన్ నటించిన మదరాసి, మౌళి తనూజ్ హీరోగా వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమాను రిలీజ్ చేశారు. అంత పోటీ నడుమ మిరాయ్ ను రిలీజ్ చేస్తే.. ఓపెనింగ్స్ మీద దెబ్బ పడుతుందనే ఉద్దేశంతో మూవీని సెప్టెంబర్ 12న రిలీజ్ చేశారు. ఈ మూవీ టీమ్ తీసుకున్న నిర్ణయం లిటిల్ హార్ట్స్ సినిమాకు బాగా కలిసొచ్చింది.
Read Also : Teja Sajja : తేజసజ్జా ఆ హీరోల లిస్టులో చేరిపోయాడోచ్..
మనకు తెలిసిందే కదా.. ఘాటీ, మదరాసి, లిటిల్ హార్ట్స్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే.. చిన్న బడ్జెట్ మూవీ లిటిల్ హార్ట్స్ మాత్రమే హిట్ దక్కించుకుంది. మిగతా రెండు సినిమాలు బోల్తా పడ్డాయి. ఒకవేళ అదే రోజున మిరాయ్ మూవీ రిలీజ్ అయితే లిటిల్ హార్ట్స్ కు ఈ స్థాయి క్రేజ్, కలెక్షన్లు వచ్చేవి కావేమో. ఎందుకంటే లిటిల్ హార్ట్స్ తో పోలిస్తే మిరాయ్ కు క్రేజ్ ఎక్కువ. పైగా తేజ సజ్జా, మనోజ్, శ్రియ లాంటి స్టార్లు ఉన్నారు. లిటిల్ హార్ట్స్ కు బడ్జెట్ లేదు.. స్టార్లు లేరు. అలా అని మిరాయ్ రేంజ్ లో యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ కూడా రాలేదు. కాబట్టి మిరాయ్ మూవీ అదే రోజున వస్తే లిటిల్ హార్ట్స్ కు హిట్ టాక్ వచ్చినా.. ఈ స్థాయి కలెక్షన్లు రాకపోవచ్చు. కాబట్టి మిరాయ్ వాయిదా మౌళి సినిమాకు కలిసొచ్చిందన్నమాట.
Read Also : Ramu Rathod : రాము రాథోడ్ అలా ఉండటం నచ్చట్లేదు.. పేరెంట్స్ ఎమోషనల్