Manchu Lakshmi : మంచు లక్ష్మీ తాజాగా చేసిన పోస్టు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆమె ఈ నడుమ కొంచెం సైలెంట్ గానే ఉంటోంది. మంచు ఫ్యామిలీలో గొడవలతో పాటు ఆమెపై బెట్టింగ్ యాప్స్ కేసు నమోదు కావడంతో సైలెంట్ అయిపోయింది. ఇలాంటి టైమ్ లో ఆమె చేసిన ఓ సెన్సేషనల్ పోస్టు వైరల్ అవుతోంది. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో మాజీ ప్రేయసి రియా చక్రవర్తికి క్లీన్ చిట్ ఇచ్చింది సీబీఐ. ఆమె ప్రమేయం లేదని చెప్పి కేసును క్లోజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. అయితే ఆమెకు మద్దతుగా మంచు లక్ష్మీ పోస్టు చేసింది.
MS Dhoni: రిటైర్మెంట్ పుకార్లపై ఎంఎస్ ధోనీ క్లారిటీ..
‘నిజాన్ని ఎవరూ దాచలేరు. రియా చక్రవర్తి ఎలాంటి తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించింది. ఒక కుటుంబాన్ని అనవసరంగా నిందించారు. ఆ కుటుంబం ఎంత మనోవేధన అనుభవించిందో ఒకసారి ఆలోచించండి. ఆమెను నిందించిన వారంతా ఆమెకు క్షమాపణలు చెప్పాలి’ అంటూ మంచు లక్ష్మీ రాసుకొచ్చింది. ఆమె చేసిన ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రియా చక్రవర్తికి సోషల్ మీడియాలో భారీగా మద్దతు పెరుగుతోంది. ఆమెకు సపోర్టు చేస్తూ వేలాది పోస్టులు వెలుస్తున్నాయి. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేలా ఆమె ప్రోత్సహించలేదని సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.