Bheeshma Parvam: మోహన్‌లాల్ రికార్డు స్మాష్ చేసిన మమ్ముట్టి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ మధ్య గత కొన్నేళ్ళుగా బాక్సాఫీస్ వార్ జరుగుతూ వస్తోంది. అయితే ఇటీవల కాలంలో పూర్తిగా మోహన్ లాల్ ఆధిపత్యం కొనసాగుతోంది. మమ్ముట్టి బాక్సాఫీస్ వద్ద బడా హిట్ కొట్టి చానాళ్ళయింది. తమ హీరో తప్పకుండా సూపర్ హిట్ తో వస్తాడని మమ్ముట్టి ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. వారి కోరిక గత వారం నెరవేరింది. మమ్ముట్టి తాజా చిత్రం ‘భీష్మపర్వం’ గత శుక్రవారం విడుదలై స్మాషింగ్ హిట్ సాధించింది. విమర్శకుల ప్రశంసలతో పాటు వసూళ్ళ పరంగాను దుమ్ముదులుపుతోంది. కేరళలో తొలి వారాంపు వసూళ్ళలో రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకూ ఆ రికార్డ్ మోహన్ లాల్ నటించిన ‘లూసిఫర్’ పేరుమీద ఉంది. ఇప్పుడు మోహన్ లాల్ రికార్డ్ ను మమ్ముట్టి స్మాష్ చేసేశాడు.
అమల్ నీరద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మమ్ముట్టితో పాటు అనసూయ, నదియా, శ్రీనాద్, ఫర్హాన్ ఫాజిల్ నెడుముడి వేణు, అరుణ్ కుమార్ నటించారు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. ఇప్పటి వరకూ మలయాళ పరిశ్రమలో అత్యధిక తొలి వారాంతపు వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాలుగా ‘భీష్మ పర్వం’, ‘లూసిఫర్’, ‘బాహుబలి 2’, ‘కాయం కులం కొచ్చున్ని’, ‘ఒడియన్’ నిలిచాయి. అనసూయ నటించిన తొలి మలయాళ చిత్రమిది. తన తొలి మలయాళ చిత్రమే ఇండస్ట్రీ హిట్ గా నిలవటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది అనసూయ.
Also Read
- Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
- Bhairavi Aarthya : పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనం!
- Varalaxmi Sarathkumar : నేను అరవను కరుస్తా...డైరెక్టర్'కు వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
- Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్... స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!