Malvi: కొంత కాలంగా రాజ్ తరుణ్ ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తనను రహస్యంగా ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు మరొక హీరోయిన్ తో కలిసి తిరుగుతున్నాడు అంటూ లావణ్య అనే యువతి పోలీసులను ఆశ్రయించింది. అయితే లావణ్య తనను ఇబ్బంది పెడుతోంది అంటూ రాజ్ తరుణ్ తో తిరగబడరాసామి అనే సినిమా చేసిన మాల్వి మల్హోత్రా కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరొకపక్క రాజ్ తరుణ్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే లావణ్య ఆధారాలు సమర్పించడంతో రాజ్ పోలీసులు విచారణకు రావాల్సిందిగా కోరారు. అయితే తాను ఇప్పట్లో రాలేనని పోలీసులకు రాజ్ తరుణ్ సమాధానం కూడా.
Also Read:Raj Tarun: లావణ్య అంశం మీద రాజ్ తరుణ్ కీలక వ్యాఖ్యలు
అయితే ఇప్పుడు రాజ్ తరుణ్ మీడియా ముందుకు ఈ వివాదం తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చాడు. ఆయనతో పాటు తిరగబడరా సామి ప్రెస్ మీట్ కి మాల్వి మల్హోత్రా కూడా హాజరైంది. ఈ వ్యవహారంలో మీ పేరు కూడా వినిపిస్తోంది కదా అని అడిగితే అందుకు ఆమె స్పందించింది. నేను చెప్పాల్సినవి అన్నీ ముందే చెప్పాను అని అన్నారు. ఏది చేసినా మేము లీగల్ గానే ప్రోసీడ్ అవుతామని అన్నారు. కేసులు అయ్యాక కూడా జులై 24న కూడా మెసేజ్ చేసింది. అది కూడా పోలీసులకు సబ్మిట్ చేశానని అన్నారు. అంతేకాదు 2020 లో నా మీద ఎటాక్ చేసిన క్రిమినల్స్ తో ఆమె టచ్ లోకి వెళ్ళింది కాబట్టి ఆమె కూడా క్రిమినల్ అని నా ఉద్దేశం అని మాల్వి మల్హోత్రా పేర్కొంది..