Malvi Malhotra: ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లకు ఉండే ఇబ్బందులు అందరికి తెలిసినవే. అయితే ఆ సమయంలో వారు పడిన ఇబ్బందులు ఎవరికి చెప్పినా పట్టించుకోరు. అదే హీరోయిన్ సక్సెస్ అయిన తరువాత చేప్తే.. అవునా.. ? నిజమా.. ? అని ఆశ్చర్యపడుతూ ఉంటారు. కొంతమంది మేకర్స్.. హీరోయిన్స్ తో సినిమాలు తీసాకా పారితోషికాలు ఎగ్గొడుతూ ఉంటారు. ఇలాంటి ఘటనలు చాలా సార్లు విన్నాం. ఎంతోమంది హీరోయిన్లు తమ కెరీర్ లో కూడా ఇలాంటివి జరిగాయని చెప్తూనే ఉంటారు. తాజాగా బాలీవుడ్ నటి మాల్వీ మల్హోత్రా కూడా అదే తరహాలో చెప్పుకురావడం హాట్ టాపిక్ గా మారింది. ఒక స్టార్ డైరెక్టర్ .. సినిమా అయిపోయాక డబ్బులు ఇవ్వకుండా మోసం చేసాడని ఆరోపించింది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ విక్రమ్ భట్. సాధారణంగా.. ఇలాంటివన్నీ చిన్న చిన్న డైరెక్టర్స్ డబ్బులు లేక చేస్తూ ఉంటారు. కానీ, విక్రమ్ భట్ కు ఉన్న పేరు ప్రఖ్యాతలు తెలియనివి కావు. ఆయన ఇలాంటి పని చేశాడు అని అంటే చాలామంది ముక్కన వేలేసుకుంటున్నారు. అసలు ఏం జరిగింది అనేది ఆమె ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది.
మాల్వీ మల్హోత్రా.. సీరియల్ నటిగా కెరీర్ ను మొదలుపెట్టిన ఆమె.. హిందీలో హోటల్ మిలాన్ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంటర్ అయ్యింది. ఈ సినిమా తరువాత ఆమెకు మంచి అవకాశాలే దక్కాయి. తెలుగు, తమిళ్, మలయాళ సినిమాలతో బిజీగా ఉన్న మాల్వీ ప్రస్తుతం తెలుగులో రాజ్ తరుణ్ సరసన తిరగబడరా సామీ సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాల్వీ తాన్ గత జీవితాన్ని చెప్పుకొచ్చింది. ” బర్బాద్ కర్ దియా తేరే ప్యార్ అనే మ్యూజిక్ ఆల్బమ్ లో పని చేశాను. దానికి విక్రమ్ భట్ కుమార్తె కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. నేను అప్పుడప్పుడే సౌత్ సినిమాల్లో నటించడం మొదలుపెట్టాను. ఆ సమయంలోనే ఈ ఆఫర్ వచ్చింది. నేను బిజీగా ఉన్నా కూడా విక్రమ్ భట్ ను నమ్మి.. షెడ్యూల్ డేట్స్ ఇచ్చా. ఇక షూటింగ్ అయ్యాక న పెండింగ్ డబ్బులు పంపలేదు. విక్రమ్ కు కాల్ చేస్తే ఆన్సర్ చేయలేదు. కొన్ని నెలల తర్వాత విక్రమ్ భట్ మళ్లీ వారి తన ప్రాజెక్ట్‌లో పని చేయమని నన్ను అడిగారు. కానీ నేను ఒప్పుకోలేదు. మరో నటి నాలా మోసపోకూడదు అని నేను ఇది చెప్తున్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.