అక్కినేని ప్రిన్స్ అఖిల్ అక్కినేని నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్’. స్టైలిష్ యాక్షన్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ అయిన సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో అఖిల్ సాలిడ్ ఫిజిక్ తో, లాంగ్ హెయిర్ తో సూపర్బ్ గా ఉన్నాడు. గ్లిమ్ప్స్, టీజర్, రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వీడియో, పోస్టర్స్ తో ఇంటెన్స్ యాక్షన్ మోడ్ ఫీలింగ్ ని తెచ్చిన మేకర్స్, ఈసారి లవ్ ఫీల్ ని తీసుకోని వస్తు ఫస్ట్ సాంగ్ అనౌన్స్మెంట్ చేశారు. ఈరోజు సాయంత్రం ఏజెంట్ సినిమా నుంచి రిలీజ్ కానున్న ఫస్ట్ సింగల్ ప్రోమోని విడుదల చేశారు. “నా లేటెస్ట్ మిషన్ వి నువ్వే, సాదించాలనిపిస్తుందే” అంటూ సాగిన ప్రోమో సాంగ్ లో లొకేషన్స్ చాలా ఎగ్జాటిక్ గా ఉన్నాయి. అఖిల్ యాక్షన్ మోడ్ నుంచి లవర్ బాయ్ మూడ్ లోకి వచ్చినట్లు, కూల్ గా కనిపించాడు. హీరోయిన్ సాక్షి, ఏజెంట్ టీజర్ తర్వాత ప్రమోషనల్ కంటెంట్ లో కనిపించడం ఇదే మొదటిసారి. ఈ ప్రోమో సాంగ్ లో సాక్షి, అఖిల్ పక్కన అందంగా కనిపించింది. హిప్ హాప్ తమిళ ఇచ్చిన ట్యూన్ ఇంప్రెస్ చేసింది. మరి ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.
ఇదిలా ఉంటే వైల్డ్ సాలాగా అఖిల్ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడానికి 2021 డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకి వస్తాడు అనుకుంటే అక్కడి నుంచి పోస్ట్ పోన్ అయ్యి గతేడాది ఆగస్ట్ 12ని రిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యింది. ఈ టైంలో కూడా విడుదల చెయ్యకుండా ఏజెంట్ సినిమాని 2023 సమ్మర్ లో ఆడియన్స్ ముందుకి తెస్తాం అని మేకర్స్ అనౌన్స్ చేశారు. చెప్పినట్లుగానే ఏజెంట్ సినిమాని ఏప్రిల్ 28న ఆడియన్స్ ముందుకి తెస్తున్నట్లు ప్రొడ్యూసర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు.
The #AGENT Musical blast begins with a Love mission💥
Here's the promo of #MalliMalli ❤️#AgentFirstSingle Launch Tomorrow @ 7:03 PM in Twitter Space 😎@AkhilAkkineni8 @DirSurender @sakshivaidya99 @hiphoptamizha @AnilSunkara1 @VamsiVakkantham @S2C_Offl @LahariMusic @TSeries pic.twitter.com/9q1EvV2DXT
— AK Entertainments (@AKentsOfficial) February 21, 2023