మలయాళ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ మలయాళ సీనియర్ నటి కోజికోడ్ శారద(84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో సోమవారం కేరళలోని కోజికోడ్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మంగళవారం మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
రంగస్థల నటిగా మంచి పేరుతెచ్చుకున్న శారద 1979 లో ‘అంగక్కురి’ చిత్రంతో వెండితెరపై కనిపించారు. దాదాపు 90 కి పైగా సినిమాలలో నటించిన ఆమె ఆ తరువాత సీరియల్స్ లో కూడా కనిపించి మెప్పించారు. ఆమె మృతిపట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. మలయాళ స్టార్ హీరోలు మోహన్ లాల్, పృధ్వీరాజ్ సుకుమారన్ ట్విట్టర్ ద్వారా ఆమె మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
Rest in peace 🙏 pic.twitter.com/aR4DyQLP5e
— Prithviraj Sukumaran (@PrithviOfficial) November 9, 2021