Malavika Mohanan:మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్టర్ సినిమాతో తెలుగు అభిమానులు కూడా తన వలలో వేసుకున్న ఈ బ్యూటీ వరుస సినిమాలను చేస్తూ స్టార్ హీరోయిన్ రేస్ లో ఉండడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ సరసన రాజా డీలక్స్ లో నటిస్తుంది. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా కాకుండా ఈ భామ మరో పాన్ ఇండియా సినిమా అయినా తంగలాన్ చిత్రంలో కూడా నటిస్తోంది. రెండు ఇండస్ట్రీలలో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న మాళవిక పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. ఇక సినిమాల గురించి పక్కన పెడితే సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చేసే రచ్చ అంత ఇంతా కాదు. అందాల ఆరబోతకు బ్రాండ్ అంబాసిడర్ గా నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ కుర్రకారును మత్తెక్కిస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ అభిమానులతో కలిసి చిట్ చాట్ సెషన్ మొదలుపెట్టింది. #AskMalavika పేరుతో అభిమానులను తమకిష్టమైన ప్రశ్నలను అడగమని చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగా అభిమానులు ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఓపిగ్గా సమాధానం ఇచ్చింది.
Sai Pallavi: ఈమె సీత అయితే.. అంతకుముందు సీతగా చేసినవారిని మర్చిపోవచ్చు.. ?
ఇక ఈ ప్రశ్నల్లో ఒక అభిమాని ‘డుంకీ లేదా సలార్.. ఏది’ అని అడగ్గా ముద్దుగుమ్మ సంకోచించకుండా ప్రభాస్ పేరు చెప్పి ఫాన్స్ ను బుట్టలో వేసుకుంది. “రెండు సినిమాల కోసం ఎంత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. కానీ, నేను ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తే మాత్రం సలార్ ను ఎంచుకుంటాను. సలార్ టీజర్ లో ప్రభాస్ సర్ , పృథ్వీరాజ్ సర్ చాలా కూల్ గా కనిపించారు అనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చింది. దీంతో ప్రభాస్ ఫాన్స్ ఒక్కసారిగా సూపర్ మాళవిక అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఒక్క మాటతో ముద్దుగుమ్మ ప్రభాస్ ఫ్యాన్స్ అందర్నీ తన వలలో వేసుకుంది అని అభిమానులు చెప్పకువస్తున్నారు. మరి రాజా డీలక్స్ తో మాళవిక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Really excited for both but if I had to pick one I would say #Salaar ☺️ loved the teaser & thought Prabhas sir & Prithviraj sir looked too cool in it! 🔥 https://t.co/SxOIjbgop6
— Malavika Mohanan (@MalavikaM_) October 3, 2023