Malaika Arora : బాలీవుడ్‌లో బోల్డ్ బ్యూటీ పేరొందిన మలైకా అరోరా మరోసారి తన ఓపెన్ కామెంట్స్ తో చర్చల్లో నిలిచింది. పర్సనల్ లైఫ్, రిలేషన్‌షిప్‌లపై తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూనే వస్తోంది. తాజాగా వివాహం గురించి ఒక ఆసక్తికరమైన కామెంట్ చేసింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “పెళ్లి చేసుకునే ముందే, కాబోయే జీవిత భాగస్వామితో డేటింగ్ చేయాలి. అప్పుడు మాత్రమే అతని అసలు స్వభావం, బాధ్యత, పురుషత్వం వంటి విషయాలు అర్థమవుతాయి. కలిసి గడిపే ఆ సమయం భవిష్యత్ కి చాలా కీలకం” అని మలైకా స్పష్టం చేసింది.
Read Also : Shiva Re-Release : ఆర్జీవీ-నాగార్జున స్పెషల్ చిట్ చాట్.. వీడియో రిలీజ్
అంటే పెళ్లికి ముందే కాబోయే వ్యక్తితో శృంగారం చేస్తే.. అతను నిజమైన మగాడో కాదో తెలుస్తుందని ఆమె ఉద్దేశం. ఆ వ్యక్తితో అమ్మాయికి పర్సనల్ సంతృప్తి ఉందా లేదా అనేది తెలుస్తుందని.. లేదంటే పెళ్లయ్యాక ఇబ్బంది పడాల్సి వస్తుందంటూ చెప్పుకొచ్చింది మలైకా. రీసెంట్ గా తనకు తెలిసిన అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయి గే అని తెలిసి ఆమె ఇబ్బంది పడిందంటూ రాసుకొచ్చింది మలైకా. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి.
Read Also : Spirit : ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. స్పిరిట్ పై సందీప్ రెడ్డి అప్డేట్..