Nithin: టాలీవుడ్ కి హీరోయిన్ల కొరత.. శ్రీలీలే దిక్కంటున్న నితిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nithin says tollywood is with deficit of heroines: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలు చేస్తూ.. బిజీ బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ ఈ కుర్ర హీరోకు మాత్రం ఫ్లాప్స్ ఎదురవుతున్నాయి. ఇక అతని ఆశలన్నీ ఎక్స్ ట్రా ఆర్డినరీ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాలో తొలిసారిగా టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇక వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది. ఇక తాజా విషయం ఏంటంటే.. వెంకీ కుడుములతో నితిన్ మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భీష్మ సినిమా తర్వాత ఈ కాంబో మరోసారి రిపీట్ కానుంది. ఇక ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా రష్మిక మందన్నా అనుకున్నారు. భీష్మ కాంబో మరోసారి రిపీట్ అంటూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు.
Mahesh Babu: యానిమల్ కి ప్లస్ అవుతాడని బాబుని తీసుకొస్తే చివరికి బాబే మైనస్ అయ్యాడే?
Also Read
ఏమైందో తెలియదు.. రష్మిక తప్పుకున్నట్లు వార్తలు రాగా.. ఆ మధ్య నితిన్ కూడా క్లారిటీ ఇచ్చాడు. తన సినిమాలో రష్మిక నటించడం లేదని చెప్పుకొచ్చారు. ఇక తాజాగా ఎక్స్ట్రా ఆర్డినరీ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడిన నితిన్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక వెంకీ కుడుముల సినిమాలో కూడా శ్రీలీలనే హీరోయిన్ గా తీసుకున్నట్టు స్పష్టం చేశాడు. శ్రీలీలతో వర్క్ చేయడం హ్యాపీగా ఉందని వెల్లడించారు. తన రెండు సినిమాల్లోనూ శ్రీ లీలనే హీరోయిన్ గా తీసుకున్నట్లు చెప్పి షాక్ ఇచ్చాడు. నితిన్ వ్యాఖ్యలతో శ్రీ లీల తన లక్కీ ఛార్మ్ గా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి శ్రీ లీల.. నితిన్ పాలిట లక్కీ ఛార్మ్ అవుతుందో లేదో. ఎక్స్ ట్రా ఆర్డినరీ సినిమాలో రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 8న రిలీజ్ కానుంది. ఈ సినిమాను నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!