SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబో ముచ్చటగా మూడో సినిమాగా తెరకెక్కుతోంది SSMB28. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకోగా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే త్రివిక్రమ్ స్క్రిప్ట్ విషయంలో కొద్దిగా ఆలస్యం చేయడం వలనషూటింగ్ ఆలస్యం అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఇక తాజాగా అందుతునన్ సమాచారం ప్రకారం త్రివిక్రమ్ ను ఎంత వీలైతే అంత త్వరగా వదిలించుకోవడానికి మహేష్ ట్రై చేస్తున్నాడని వార్తలు వినిపిసస్తున్నాయి. అందుకు కారణం రాజమౌళి అని తెలుస్తోంది. జక్కన్న- మహేష్ కాంబో త్వరలోనే రానున్న విషయం తెల్సిందే. ఇక ఇప్పటికే రాజమౌళి కథను కూడా సిద్ధం చేసే పనిలో ఉన్నాడు.
ఇక ఈ సమయంలో ఎప్పుడైనా జక్కన్న షూటింగ్ మొదలు అని చెప్తే, అప్పుడు డేట్స్ అడ్జెస్ట్ చేయడానికి మహేష్ కు కుదరదు. దానివలన జక్కన్న సినిమా లెట్ అవుతోంది. అతనితో సినిమా అంటే టైమ్ గురించి మాట్లాడకూడదు. మధ్యలో ఎలాంటి కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు. ఇక ప్రస్తుతం మహేష్ చేతిలో ఉన్నది ఇదొక్కటే సినిమా.. ఇవన్నీ అలోచించి మహేష్.. త్రివిక్రమ్ సినిమాను ఎంత వీలైతే అంత త్వరగా పూర్తి చేయడానికి ఆరాటపడుతున్నాడట. మేకర్స్ కు సైతం ఇదే విషయాన్ని చెప్పి షెడ్యూల్స్ ప్లాన్ చేయమని చెప్పాడని టాక్. దీంతో కీలక షెడ్యూల్స్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. యాక్షన్ ఎపిసోడ్స్, సాంగ్స్ ముందు షూటింగ్ చేసేసి త్వరగా మహేష్ పార్ట్ ను కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉన్నది అనేది తెలియాలి.