ఘట్టమనేని అభిమానులు చాలా స్పెషల్… ఏ హీరో ఫాన్స్ అయినా తమ హీరో సినిమా బాగున్నా బాగోలేకపోయినా సినిమా చూస్తారు. ఘట్టమనేని ఫాన్స్ మాత్రమే సినిమా కాస్త వీక్ గా ఉంది అని అర్ధం అయితే చాలు మహేష్ అన్నా ఇలాంటి సినిమాలు మనకి వద్దు అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. క్రిటిక్స్ కన్నా ముందే సినిమాని రిజల్ట్ ని చెప్పేస్తూ ఉంటారు ఈ ఫాన్స్. అంత క్రిటికల్ గా ఉంటారు కాబట్టే ఘట్టమనేని ఫాన్స్ చాలా స్పెషల్. శ్రీమంతుడు, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట… ఈ లిస్టులో నష్టాలు తెచ్చిన సినిమా కానీ ఫ్లాప్ అయిన సినిమా కానీ లేదు. అన్నీ హిట్ సినిమాలే, ఈ రేంజ్ హిట్స్ బ్యాక్ టు బ్యాక్ కొడితే ఏ ఫాన్స్ అయినా తమ హీరోని నెత్తిన పెట్టుకోని చూస్తారు. మహేష్ ఫాన్స్ మాత్రమే ఇలాంటి మెసేజ్ ఇచ్చే సినిమాలు ఇక చాలు మాస్ సినిమాలు చేయమని అడుగుతూ ఉంటారు. వింటేజ్ మహేష్ ని చూపించు అన్నా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉంటారు. అభిమానుల కోరిక మేరకు మాస్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తూ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ టైటిల్ అనౌన్స్మెంట్ తో ఆడియన్స్ ముందుకి వచ్చేసాడు.
తలకి తువాలు కట్టి, నోట్లో బీడీ పెట్టి మహేష్ బాబు పోకిరి రోజులని గుర్తు చేసే రేంజులో ఉన్నాడు. త్రివిక్రమ్ ఘట్టమనేని అభిమానులకి కావాల్సిన మాస్ ని గ్లిమ్ప్స్ తోనే సాలిడ్ గా ప్రెజెంట్ చేసాడు. ఈ మాస్ స్ట్రైక్ వీడియోలో మహేష్ బాబు బీడీ తాగుతూ కనిపించడం హైలైట్ అయ్యింది. మహేష్ ఒకప్పుడు తన సినిమాలు చూసి అభిమానులు కూడా స్టైల్ గా సిగరెట్స్ తాగడం నేర్చుకుంటూ ఉన్నారు అని స్మోక్ చేయడం మానేసాడు. చైన్ స్మోకర్ అయిన మహేష్ అభిమానుల కోసం పొగతాగడం మానేసాడు. ఇప్పుడు అదే అభిమానుల కోసం, వాళ్లకి వింటేజ్ మాస్ చూపించడం కోసం మహేష్ మళ్లీ పొగ తాగడం మొదలుపెట్టాడు. ఇది ఈ సినిమా వరకే పరిమితం అవుతుందా లేక కంటిన్యు అవుతుందా అనేది తెలియదు కానీ అభిమానుల కోసం సిగరెట్ మానేసినా, మళ్లీ తాగినా అది మహేష్ బాబుకి మాత్రమే చెల్లింది.