గుంటూరు కారం సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ సోషల్ మీడియాలో అర్ధం పర్థంలేని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం అజ్ఞాతవాసి సినిమా సాంగ్స్, గుంటూరు కారం సాంగ్స్ ఒకటే రోజున రిలీజ్ అయ్యాయి… రిజల్ట్ కూడా అలానే ఉండదు కదా అనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు మరో కొత్త కామెంట్ లైమ్ లైట్ లోకి వచ్చింది. మహేష్ బాబు-త్రివిక్రమ్ 12 ఏళ్ల తర్వాత కలిసి చేస్తున్న ఈ సినిమాపై పాజిటివ్ వైబ్ ఎంత ఎక్కువగా ఉందో అందరికీ తెలిసిందే. అన్ని సెంటర్స్ లో గుంటూరు కారం సినిమా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని రాబడుతుంది అనే నమ్మకం బయ్యర్స్ లో కూడా ఉంది. ఈ సినిమాకి అత్యధిక థియేటర్స్ కి ఇవ్వడానికి దిల్ రాజు కూడా రెడీగా ఉన్నాడు. ఒక సెంటర్ లో ఒకటే థియేటర్ ఉంటే ఆ ఒక్క థియేటర్ లో కూడా గుంటూరు కారం సినిమా మాత్రమే పడుతుందని నాగ వంశీ అభిమానులు భరోసా ఇస్తున్నాడు. థియేటర్స్ విషయంలో మేకర్స్ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే కొంతమంది మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో… గుంటూరు కారం రన్ టైమ్ విషయంలో భయపడుతున్నారు.
సెన్సార్ కంప్లీట్ చేసుకోని U/A తెచ్చుకున్న గుంటూరు కారం సినిమా 159 నిమిషాల రన్ టైమ్ కలిగి ఉంది అంటే రెండు గంటల ముప్పై తొమ్మిది నిముషాలు. కొందరికి ఈ రన్ టైమ్ విషయంలో వచ్చిన సమస్య ఏంటో తెలియదు కానీ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలు కూడా 160 నిమిషాల కన్నా తక్కువ నిడివితోనే వచ్చాయి. ఆ సినిమాలు మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లుగా నిలిచాయి, ఇప్పుడు గుంటూరు కారం సినిమా కూడా 160 నిమిషాల కన్నా తక్కువ నిడివితో రిలీజ్ అవుతుంది? రిజల్ట్ ఏమవుతుందో అనే భయంలో కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ భయంలో, ఈ కామెంట్స్ లో అసలు ఎలాంటి అర్ధం లేదు ఎందుకంటే ఒక సినిమా నిడివిని డిసైడ్ చేసేది సెంటిమెంట్ కాదు కథ కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి థియేటర్స్ కి వెళ్లిపోయి సినిమాని ఎంజాయ్ చేయండి.